• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కన్య పూజ’ చేసిన ముఖ్యమంత్రి

    ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ‘కన్య పూజ’ చేశారు. శరన్నవరాత్రి వేడుకల్లో తొమ్మిదో రోజు అంటే నవమి నాడు దుర్గామాతను చిన్న పిల్లల్లో చూసుకుని పూజించడం ఆనావయతీ. తొమ్మిది మంది పిల్లలను తొమ్మిది శక్తి అవతారాలుగా అలంకరించి వారికి సేవ చేస్తారు. నవరాత్రుల పూజల్లో దక్కే పుణ్యం ఈ ఒక్క పూజతో దక్కుతుందని విశ్వాసం. దీనిని ‘కుమారి పూజ’ అని కూడా అంటారు. © ANI Photo © ANI Photo © ANI Photo © ANI Photo

    కోట్ల నోట్ల కట్టలతో అమ్మవారికి అలంకరణ

    విశాఖపట్నంలోని పురాతన ఆలయంలోని అమ్మవారిని కోట్ల విలువైన నోట్ల కట్టలతో అలంకరించారు. 135 ఏళ్ల చరిత్ర కలిగిన వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరెన్నీ నోట్లతో అలంకరించారు. రూ. 8 కోట్ల విలువైన నోట్లు, బంగారు ఆభరణాలతో ముస్తాబు చేశారు. అయితే ఆ డబ్బంతా కేవలం అలంకరణ కోసం ప్రజలు ఇచ్చిందేనని పూజ పూర్తికాగానే ఎవరి సొమ్ము వారికి తిరిగి ఇచ్చేస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆ డబ్బేది ఆలయ ట్రస్టుకు వెళ్లదని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.

    చైన్నైలో కొలుబొమ్మల ఎగ్జిబిషన్

    నవరాత్రి ఉత్సవాలకు ముందే తమిళనాడు చెన్నైలో కొలుబొమ్మల ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఖాదీ క్రాఫ్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన కొనసాగుతుంది. రూ.500 నుంచి రూ.20,000 వరకు గల అనేక బొమ్మలను ఏర్పాటు చేశారు. మట్టి, రాతి శిల్పాలతోపాటు దుర్గామాత, కృష్ణుడి విగ్రహాలు, రామాయణ సెట్లు కూడా ఉన్నాయని నిర్వహకులు వెల్లడించారు. Courtesy Twitter: Screengrab Twitter: Screengrab Twitter: Screengrab Twitter: