డిసెంబర్ చివరి కల్లా నోటిఫికేషన్లు
తెలంగాణలో 80,039 ఉద్యోగ నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి KCR గతంలో ప్రకటించారు. ఇందులో ఇప్పటిదాకా 61 వేల పోస్టులకు సంబంధిత శాఖలకు పరిపాలనా అనుమతులు లభించాయి. గ్రూప్-1 పోస్టులకు ఇప్పటికే ప్రక్రియ తుది దశలో ఉంది. డిసెంబర్ చివరికల్లా ఈ 61వేల పోస్టులకు దాదాపుగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో గ్రూప్-2, ఆ తర్వాత వారం గ్యాప్లో గ్రూప్-3తోపాటు డిసెంబర్ నాటిికి వివిధ శాఖల్లో ఖాళీలకు నోటిఫికేషన్ల జాతర కొనసాగనుంది.