రాచకొండ సీపీ మహేష్ భగవత్ ట్రాన్స్ ఫర్?
రాచకొండ కమిషనరేట్ కు మహేష్ భగవత్ స్థానంలో త్వరలో కొత్త కమిషనర్ రానున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం త్వరలో రానున్న మునుగోడు ఉపఎన్నికలేనని అధికారులు అంటున్నారు. మునుగోడులోని చౌటుప్పల్, నారాయణ పూర్ మండలాలు రాచకొండ పరిధిలో ఉన్నాయి. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేస్తున్న అధికారులు ట్రాన్స్ ఫర్ అవుతారు. ఈ నేపథ్యంలో ఏడేళ్లుగా రాచకొండ సీపీగా బాధ్యతలు చేపడుతున్న మహేష్ భగవత్ కూడా బదిలీ అవుతారని అధికారులు చెబుతున్నారు.