అదిరిన బైడు ఎలక్ట్రిక్ కార్…డ్రైవర్ లేకుండానే
చైనీస్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం బైడు సరికొత్త ఎలక్ట్రిక్ రోబో కారుని బుధవారం ఆవిష్కరించింది. ఇద్దరు, నలుగురు ప్రయాణీకులతో RT6 సీట్లు కేటాయించారు. ఈ కారుకు డ్రైవర్ అవసరం లేదు. దీంతో ఇది స్టీరింగ్ లేకుండా AI, సెన్సార్ సిస్టమ్ ద్వారా పనిచేయనుంది. ఒక్కో యూనిట్ $37,000 వరకు ఉంటుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఖర్చు తగ్గడం వల్ల చైనా అంతటా పదివేల వరకు ఈ కార్ల సేల్స్ ఉంటాయన్నారు.