RRRకు మరో హాలీవుడ్ డైరెక్టర్ ఫిదా
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ఏ మేర భారీ విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడుదలైన అన్ని చోట్ల భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇండియాతో పాటు వెస్టర్న్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు, ప్రేక్షకులు RRRను పొగడగా.. తాజాగా డాక్టర్ స్ట్రేంజ్ డైరెక్టర్ స్కాట్ డెరిక్సన్ RRRపై ప్రశంసలు కురిపించారు.