శబరిమల సందర్శనకు భారీగా బుకింగ్స్
శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. సోమవారం ఒక్కరోజే లక్షలకు పైగా మంది భక్తులు దర్శనానికి బుకింగ్ చేసుకున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీకి తగ్గట్లు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పంపా నుంచే భక్తులను నియంత్రిస్తున్నామని.. ప్రతి పాయింట్ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారని పేర్కొన్నారు. క్యూ లైన్లలో నిలబడిన భక్తులకు తేలికపాటి ఆహారం, మంచినీరు అందజేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.