• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • న్యూజిలాండ్‌తో సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం

    న్యూజిలాండ్‌తో రేపటి నుంచి జరగునున్న మూడు వన్డేల సీరిస్‌కు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. ఈమేరకు బీసీసీఐ ట్వీట్ చేసింది. వెన్ను గాయం కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌కు దూరమైనట్లు పేర్కొంది. అతడి స్థానంలో రాజత్ పటిదార్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. రేపు హైదరాబాద్‌ వేదికగా జరగనున్న తొలి వన్డేలో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.

    శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు

    భారత టాపార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ గడ్డపై అరుదైన రికార్డు నెలకొల్పాడు. మొదటి వన్డేలో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా ఓ రికార్డుతో మెరిశాడు. కివీస్ గడ్డపై వన్డేల్లో వరుసగా నాలుగు లేదా ఎక్కువసార్లు అర్ధసెంచరీలు సాధించిన రెండో విదేశీ ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా అతడి కంటే ముందున్నాడు. కాగా గత 8 వన్డేల్లో భారత్ తరఫున అయ్యర్ 5 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించి ప్రపంచకప్ రేసులో నిలుస్తున్నాడు.

    కోహ్లీ నెం.3 స్థానాన్ని మారుస్తారా?: గవాస్కర్

    శ్రీలంకతో టీ20 సిరీస్‌లో నెం.3 స్థానంలో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ కోసం టీ20లలో కోహ్లీ ఎప్పటి నుంచో ఆడుతున్న నెం.3 స్థానం గురించి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… కోహ్లీ స్థానాన్ని మార్చేంత సాహసం ఎవరూ చేయలేరని తెలిపాడు. అయ్యర్‌ను నెం.4 లేదా నెం.5 స్థానాాల్లో బ్యాటింగ్‌కు దించాలని సూచించాడు. ఇండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది కాబట్టి.. ప్యూర్ బౌలర్లయిన ఆవేశ్ ఖాన్, సిరాజ్ లాంటి వాళ్లకు చోటు కల్పించాలని అన్నాడు. లంకతో టీ20 సిరీస్‌లో … Read more

    ఎలాంటి అంచనాలు పెట్టుకోను: శ్రేయస్

    శ్రీలంకతో జరిగిన మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచుల్లోనూ 57, 74, 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్‌గా నిలిచిన శ్రేయస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘జట్టులో తీవ్రమైన పోటీ ఉంది. మనకు స్థానం దక్కుతుందా..?లేదా? అనే అంశాన్ని నేను పట్టించుకోను. నా ఆటతీరుపై దృష్టి పెట్టి అన్ని స్థానాల్లో ఆడటానికి ప్రయత్నిస్తానని’ పేర్కొన్నాడు. మంచి ఆటతీరుతో ఎక్కువ అవకాశాలు సాధించడానికి ప్రయత్నిస్తానని … Read more

    మరో రికార్డుతో కోహ్లీ సరసన శ్రేయస్

    భారత బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ మరో రికార్డు సాధించాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20 మ్యాచుల్లో బ్యాక్ టూ బ్యాక్ హాఫ్ సెంచరీలు చేసి విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. 2012లో కోహ్లీ బ్యాక్ టూ బ్యాక్ ఫిఫ్టీలు కొట్టి ఈ రికార్డును నమోదు చేయగా.. ప్రస్తుతం ఆ జాబితాలో రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా శ్రేయస్ చేరాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అయ్యర్ 57, 74, 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కైవసం చేసుకున్నాడు. … Read more

    మూడో టీ20 మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన భార‌త్

    మూడో టీ20 మ్యాచ్‌లో ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది. శ్రీలంతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. శ్రీలంక నిర్థేశించిన 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 16.5 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. ఫైన‌ల్ మ్యాచ్ కూడా తెల‌వ‌డంతో టీ20 సిరీస్‌ను భార‌త్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ 45 బంతుల్లో 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరికి రవీంద్ర జడేజాతో కీలక భాగస్వామ్యంతో జట్టును ఫినిషింగ్ లైన్ దాటించాడు. దీంతో భార‌త్ వ‌రుస‌గా 12వ టి20 విజ‌యం సాధించింది.