గంగూలీకి మమతా మద్దతు
ఐసీసీ చైర్మన్ పదవికి సౌరవ్ గంగూలీ పోటీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. శరద్ పవార్, జగ్మోహన్ దాల్మియాలను ఐసీసీలోకి పంపగా లేనిది, గంగూలీని ఎందుకు పంపడంలేదని మండిపడ్డారు. ఆమె పరోక్షంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆయన కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షాలపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఐసీసీ చైర్మన్ పదవికి నామినేషన్లకు అక్టోబర్ 20 చివరి తేది అయినా పట్టించుకోవడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.