కొలీజియం మార్పులకు కేంద్రం కసరత్తు
సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు లేఖ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిని చేర్చాలని సూచించారు. దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని అభిప్రాయపడ్డారు.హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి చేర్చాలని పేర్కొన్నారు. అందరికీ సమాన అవకాశం దక్కట్లేదని కొలీజియం ఆరోపణలు మూటగట్టుకుంది.