ఆకట్టుకుంటున్న ‘స్వాతిముత్యం’ టీజర్
బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో ‘స్వాతిముత్యం’ అనే సినిమా తెరకెక్కుతుంది. అయితే హీరో గణేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆధ్యాంతం వినోదభరితంగా సాగిన ఆ టీజర్ ఆకట్టుకుంటుంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేస్తామని చిత్రబృందం ఈ సందర్భంగా వెల్లడించింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.