• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పార్టీ మారే ప్రసక్తే లేదు: డీకే అరుణ

    TG: త్వరలో పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని భాజపా నేత డీకే అరుణ ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతలు మైండ్‌ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. భాజపా అదిష్ఠానం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర నాయకత్వంలో పని చేసేందుకు అదృష్టం ఉండాలని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. కాగా, భాజపా నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

    రాజాసింగ్‌ సంచలన ఆరోపణలు

    HYD: భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు ఎన్నికల ప్రచారానికి రానున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తమ ఇద్దరినీ చంపేస్తానని ఫోన్‌ చేసి బెదిరించినట్లు చెప్పారు. దీనిపై నగర పోలీసుల కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే చంపేస్తానని నిందితుడు బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలోనే ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వచ్చాయని, పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు.

    కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డి బరిలో రేవంత్‌!

    TG: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న నేపథ్యంలో రేవంత్‌ను కూడా కొడంగల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేయించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కామారెడ్డి నుంచి టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. తాజా నిర్ణయం నేపథ్యంలో షబ్బీర్‌అలీకి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ తరఫున ప్రచార బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిసింది.

    నేడు భాజపా అగ్రనేతలతో పవన్ భేటి

    తెలంగాణ ఎన్నికల వేళ భాజపాతో పొత్తు అంశంపై చర్చించేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. భాజపా పెద్దలతో చర్చించనున్నారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌ కూడా ఈ భేటిలో పాల్గొంటారని సమాచారం. ఇందులో GHMC సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, జనసేన నేతలు ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని భాజపా నేతలు వ్యక్తపరుస్తున్నారు.

    11 రోజుల్లో రూ.25 కోట్ల ఆదాయం

    TG: దసరా పండుగ సందర్భంగా TSRTC ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. కేవలం 11 రోజుల్లోనే ఆర్టీసీ ఖజానాకు రూ.25 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చాయి. సాధారణ రోజుల్లో ఆర్టీసీకి రోజుకు రూ.12-13 కోట్ల ఆదాయం వస్తే దసరా సందర్భంగా మాత్రం రోజుకు రూ.2-3 కోట్లు అదనంగా వచ్చినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. కాగా, దసరా పండుగను పురస్కరించుకుని TSRTC 5,500 ప్రత్యేక బస్సులను నడిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1,302 బస్సులను అదనంగా నడిపింది.

    27న రాష్ట్రంలో అమిత్‌షా పర్యటన

    TG: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 27న సూర్యాపేటలో నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల బహిరంగసభకు హాజరుకానున్నారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖంగా ఉన్న నేతలను ప్రత్యేకంగా పిలిపించి అమిత్‌షా మాట్లాడనున్నట్టు తెలిసింది. కాగా, 28, 29 తేదీల్లో ఎన్నికల ప్రచారానికి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, 31న యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ రాష్ట్రానికి రానున్నారు. వారు పాల్గొనే ప్రచార సభలు, రోడ్‌షోలపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

    25న కాంగ్రెస్‌ రెండో జాబితా.!

    తెలంగాణ కాంగ్రెస్‌ రెండో అభ్యర్థుల జాబితా ప్రకటనపై స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు తుదిదశకు చేరినట్టు తెలుస్తోంది. మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 35 నుంచి 40 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. ఈనెల 25న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అదే రోజున కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    లేటెస్ట్‌ సర్వే.. కేసీఆర్‌దే విజయం!

    తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేస్తుందని మిషన్‌ చాణక్య సర్వే వెల్లడించింది. తెలంగాణ ప్రజలు గులాబీ వైపే ఉన్నట్లు సర్వేలో తేలిందని పేర్కొంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు 44.62 శాతం, కాంగ్రెస్‌కు 32.71 శాతం, బీజేపీకి 17.6 శాతం ఓట్లు వస్తాయని సర్వే నివేదికలో తెలిపింది. BRS కనీసం 76 స్థానాల్లో గెలుస్తుందని మిషన్‌ చాణక్య జోస్యం చెప్పింది. గత 4 నెలల్లో రాష్ట్రంలోని 14 లక్షల మంది అభిప్రాయాలు సేకరించి ఈ డేటాను రూపొందించినట్లు సర్వే సంస్థ స్పష్టం … Read more

    భాజపా తొలి జాబితా విడుదల

    తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. 52 మందితో జాబితాను వెల్లడించింది. కరీంనగర్‌ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్‌ పోటీ చేయనున్నారు. గజ్వేల్‌, హుజూరాబాద్‌ రెండు స్థానాల నుంచి ఈటల రాజేందర్‌ బరిలో నిలవనున్నారు.

    ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్థి ఆత్మహత్య

    ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. అక్కడ తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్‌ గదిలో ఉరి వేసుకొని బలవన్మరణం పొందాడు. మెదక్‌ జిల్లాకు చెందిన కిరణ్ చంద్ర ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, విద్యార్థి ఆత్మహత్యకు కారణం ఏంటని తెలియలేదు.