• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారాస 25 సీట్లకే పరిమితం: రేవంత్‌

    తెలంగాణలో కాంగ్రెస్‌ వేవ్‌ను ఆపడం ఎవరి తరం కాదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారాస పనైపోయిందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మరన్నారు. భారాస సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ పార్టీలోకి వస్తున్నారంటేనే తమ బలమేంటో అర్థమవుతుందన్నారు. భారాసకు ఈసారి 25 సీట్లు దాటే అవకాశం లేదని రేవంత్‌ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 19 శాతం ఓట్లు అన్‌ డిసైడెడ్‌ మోడ్‌లో ఉన్నాయని, ఇందులో మెజారిటీ షేర్ తమకే వస్తుందన్నారు.

    హ్యాట్రిక్‌ కొట్టేది కేసీఆరే: హరీశ్‌రావు

    TG: రాష్ట్ర భాజపాపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి.. అనంతరం మాట్లాడారు. గన్నుతో, పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తి రామలింగారెడ్డి అని కొనియాడారు. దుబ్బాకలో భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో భాజపా లేచేది లేదు. కాంగ్రెస్‌ గెలిచేది లేదు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా .. హ్యాట్రిక్‌ కొట్టేది సీఎం కేసీఆరే’ అని హరీశ్‌ అన్నారు.

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికా ప్రకటనల్లో బహిరంగ పరచాలని నిర్ణయించింది. తప్పుడు అఫిడవిట్లు, ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వృద్దులు, 40శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు హక్కును కల్పిస్తామని పేర్కొంది. ఇదిలాఉంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల సన్నద్దతపై ఈసీ సమీక్షిస్తోంది.

    తెలంగాణకు నేడు ప్రధాని మోదీ

    తెలంగాణకు నేడు ప్రధాని మోదీ రానున్నారు. మహబూబ్‌నగర్‌లో తెలంగాణ బీజేపీ ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్‌పై కూడా తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ రెండూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యం లేని కుటుంబ పార్టీలు’ అంటూ విమర్శించారు.

    కాంగ్రెస్‌ పార్టీ సంచలన వాగ్దానాలు

    TG: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన విజయభేరి బహిరంగ సభలో కాంగ్రెస్‌ పార్టీ కీలక వాగ్దానాలు ప్రకటించింది. తెలంగాణలో అధికారంలోకి వస్తే ‘మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద నెలకు రూ.2500. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. పేద మహిళలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌. రైతు భరోసా కింద ఎకరాకు రైతుకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతుకూ ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్‌’ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్‌ అగ్రనేతలు … Read more

    పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభం

    తెలంగాణలో అపూర్వ ఘట్టం ఆవిష్కృత‌మైంది. పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను సీఎం కేసీఆర్‌ సాకారం చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్‌ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్‌ చేసి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ?Watershed moment in the irrigation history of #Telangana! CM #KCR … Read more

    పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభం

    తెలంగాణలో అపూర్వ ఘట్టం ఆవిష్కృత‌మైంది. పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను సీఎం కేసీఆర్‌ సాకారం చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్‌ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్‌ చేసి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ?Watershed moment in the irrigation history of #Telangana! CM #KCR … Read more

    మీమ్స్ రూపంలో ఫ్రెండ్‌షిప్ డే విషెస్

    Friendship Day Memes: ‘మీమ్స్’(Memes)కి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. సోషల్ మీడియా యూజర్లకు ఇవి లేకపోతే ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. అందుకే ఏ సందర్భాన్నైనా మీమ్స్ రూపంలో సెలబ్రేట్ చేసుకుంటారు. నేడు ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మీమర్లు పలు రకాల మీమ్స్, వీడియో మీమ్స్ చేస్తున్నారు. ‘హ్యాపీడేస్’ మూవీలోని సాంగ్‌తో బ్రహ్మానందం సీన్లను ఎడిట్ విషెస్ చెబుతున్నారు. హైదరాబాద్ హవా ట్విట్టర్ ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి. Happy Friendship Day❤Tag Ur Friends? pic.twitter.com/19oRuD2j7v — Hyderabad … Read more

    జల దిగ్బంధంలో మోరంచపల్లి గ్రామం

    TG: జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుంది. మోరంచ వాగు ఉప్పొంగడంతో సమీపంలోని ఇళ్లలోకి 4-5 అడుగుల మేర నీరు చేరింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇంటి స్లాబ్‌ల పైకి ఎక్కారు. మరికొంతమంది సమీపంలోని చెట్లపైన తలదాచుకున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అప్రమత్తం చేశారు. పోలీసులు, ఇతర అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. Hit guys, My village name is Moranchapalli, Bhupalpalli, … Read more

    భయపెడుతున్న కడెం ప్రాజెక్ట్‌

    TG: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ మరోసారి వణుకు పుట్టిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి (700 అడుగులు) చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా 14 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా అందులో నాలుగు గేట్లు తెరుచుకుకోకుండా మొరాయిస్తున్నాయి. దీంతో 14 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. వరద నీరు ఇదే పరిస్థితిలో కొనసాగితే ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన … Read more