హౌసింగ్ బోర్డును ఎత్తేసిన TS సర్కార్
హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ, దిల్ సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ బోర్డును శాశ్వతంగా ఎత్తేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ బోర్డును ఆర్అండ్బీ శాఖలో విలీనం చేస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గృహ నిర్మాణ శాఖ ఆస్తులను, పథకాలను, ఉద్యోగులను కూడా ఆర్అండ్బీలో విలీనం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.