జైల్లో గేమ్స్ ఆడుతున్న ఆఫ్తాబ్
శ్రద్ధావాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా ప్రస్తుతం తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. జైలులో అతడు ఎక్కువ సమయం చెస్ ఆడుతున్నాడు. చెస్‌ను ఇరువైపులా తాను ఒక్కడే పావులు కదుపుకుంటున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రముఖ అమెరికన నవలా రచయిత రాసిన ’ది గ్రేట్ రైల్వే బజార్’పుస్తకాన్ని ఆఫ్తాబ్ చదువుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆఫ్తాబ్ ప్రవర్తనను జైలు అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అతడికి కేటాయించిన గదిలో మరో ఇద్దరు ఖైదీలు కూడా ఉన్నారు.