• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అప్పుడు తిట్టి.. ఇప్పుడు శుభాకాంక్షలు

    నిర్మాత బండ్ల గణేష్ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.’ఆలోచించగలిగే మేధస్సు స్పందించగలిగే హృదయం అనుకువతో కూడిన మనసు ఇవన్నీ కలిగి ఉన్న మా మాటల మాంత్రికుడు తివిక్రమ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ విష్ చేశారు.కొద్దినెలలుగా బండ్ల గణేష్ పలు సందర్భాల్లో త్రివిక్రమ్‌ను విమర్శిస్తూ వస్తున్నారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో తనను కావాలనే త్రివిక్రమ్ పక్కన పెట్టాడని అప్పట్లో పెద్దఎత్తున బండ్ల కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

    త్రివిక్రమ్‌ ‘నువ్వే నువ్వే’ రీ రిలీజ్

    ఇప్పటివరకు హీరోల పుట్టినరోజులకు మాత్రమే సినిమాలను రీ రిలీజ్ చేశారు. కానీ ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్‌డే గిఫ్ట్‌గా ‘నువ్వే నువ్వే’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 4 నుంచి 7 వరకు ప్రత్యేక స్క్రీన్లలో ఈ మూవీని ప్రదర్శించనున్నారు. 2కే హెచ్‌డీ ప్రింట్‌తో షోలు వేస్తున్నారు. కాగా నువ్వే నువ్వే తో త్రివిక్రమ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో తరుణ్ హీరోగా, శ్రేయ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, సునీల్ తదితరులు నటించారు.