మలక్‌పేటలో భారీ ఐటీ టవర్
తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో 16 అంతస్తుల భారీ ఐటీ టవర్ నిర్మించనుంది. 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,032 కోట్ల వ్యయంతో టవర్ ఏర్పాటు చేయనుంది. టీఎస్ఐఐసీ-తెలంగాణ ప్రభుత్వం కలసి సంయుక్తంగా ఈ నిర్మాణం చేపట్టనున్నాయి. నగరంలో అన్ని దిక్కులా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మలక్‌పేటలో ఐటీ టవర్ నిర్మిస్తున్నారు.