‘పబ్‌లు ఈ రూల్స్ తప్పక పాటించాలి’
పబ్‌లు నిబంధనలకు లోబడి నిర్వహించాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. మైనర్లను పబ్‌లోకి అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు పబ్‌ల యాజమాన్యాలతో సీపీ నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలపై వారికి స్టీఫెన్ రవీంద్ర అవగాహన కల్పించారు. సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సౌండ్ పొల్యూషన్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని స్టీఫెన్ హెచ్చరించారు.