• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నయన్- విఘ్నేష్ సరోగసి చట్టబద్దమే: కమిటీ రిపోర్ట్

  నయనతార- విఘ్నేష్ దంపతులకు పెద్ద ఊరట లభించింది. కవల పిల్లల విషయంలో నిబంధనలు ఉల్లంఘించలేదని తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ తన నివేదికలో తెలిపింది. నిబంధనల ప్రకారమే నయన్ దంపతులు సరోగసి ద్వారా పిల్లలు కన్నట్లు పేర్కొంది.

  కిస్ వాల్ దగ్గర నయన్- విఘ్నేష్

  నయనతార- విఘ్నేష్ దంపతులు బార్సిలోనాలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కిస్ వాల్ దగ్గర దిగిన ఫొటోలను విఘ్నేష్ శివన్ షేర్ చేశాడు. ఒకరినొకరు చూసుకుంటూ కిస్ సింబల్స్‌ ఇస్తూ ఫొటోలు దిగారు. తాము దిగిన పిక్స్‌కు క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు విఘ్నేష్. మా ప్రేమ గాలిలో తేలియాడుతోంది. ఈ ఫొటోలు చాలా మనోహరంగా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. క్రేజీ కపుల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. Courtesy Twitter: Courtesy Twitter: WIKKICLIKS

  న‌య‌న‌తార‌-విఘ్నేశ్‌పై వ‌స్తున్న రూమ‌ర్లకు చెక్ పెట్టిన నెట్‌ఫ్లిక్స్‌

  న‌య‌న‌తార‌-విఘ్నేశ్ జూన్ 9న వివాహ‌బంధంతో ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుకను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్‌తో రూ.25 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. పెళ్లి ఖ‌ర్చును కూడా మొత్తం నెట్‌ఫ్లిక్స్ భ‌రించింది. ఇక వీరి పెళ్లికి వేడుక వీడియోను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రీక‌రించారు. అయితే ఇటీవ‌ల న‌య‌న‌తార దంపతులు సోష‌ల్‌మీడియాలో ఫోటోల‌ను షేర్ చేయ‌డంతో నెట్‌ఫ్లిక్స్ వీరితో ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకుంద‌ని, పెళ్లి ఖ‌ర్చును తిరిగి ఇవ్వాల‌ని నోటీసులు పంపింద‌ని ఇటీవ‌ల వార్తలు వ‌చ్చాయి. వీటికి చెక్ పెట్టిన నెట్‌ఫ్లిక్స్ … Read more

  మ‌రో వివాదంలో న‌య‌న‌తార‌-విఘ్నేశ్ జంట‌!

  కొత్త జంట న‌య‌న‌తార‌-విఘ్నేశ్ మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. పెళ్ల‌యిన త‌ర్వాత తిరుమ‌ల‌కి వెళ్లిన ఈ జంట‌పై న‌య‌న‌తార తిరువీదుల్లో చెప్పుల‌తో న‌డిచినందుకు వివాదం చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. దీనికి విఘ్నేశ్ శివ‌న్ క్ష‌మాప‌ణ‌లు కోరాడు. అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్‌తో వీరి పెళ్లి స్ట్రీమింగ్ విష‌యంలో మ‌రోసారి చిక్కుల్లో ప‌డిన‌ట్లు తెలుస్తుంది. పెళ్లి వీడియో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం ఈ జంట ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్ర‌కారం పెళ్లి ఫోటోలు బ‌య‌ట‌కు రాకూడ‌దు. కానీ విఘ్నేశ్ కొన్ని ఫోటోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వారిపై … Read more

  నయనతార దంపతులకు సూపర్ స్టార్ గిఫ్ట్

  నయనతార,విఘ్నేష్ దంపతుల పెళ్లి ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నయన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందిస్తున్నట్లు కనిపించాడు. సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ మణిరత్నం కొత్త జంటను ఆశీర్వదిస్తూ బహుమతులు అందజేసిన ఫోటోలు కూడా రివీల్ అయ్యాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. Courtesy Twitter: Courtesy Twitter: Screengrab Twitter: Courtesy Twitter:

  హ‌నీమూన్ కోసం థాయ్‌లాండ్ వెళ్లిన న‌య‌న‌తార‌-విఘ్నేశ్ జంట‌

  ఏడేళ్లుగా ప్రేమ‌లో ఉన్న త‌ర్వాత జూన్ 9న వివాహబంధంతో ఒక్క‌ట‌య్యారు న‌య‌న‌తార‌-విఘ్నేశ్. ఈ జంట ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మోస్ట్ సెల‌బ్రేటెడ్ జంట‌గా మారింది. అయితే తాజాగా వీళ్లు హ‌నీమూన్ కోసం థాయ్‌లాండ్ వెళ్లారు. అక్క‌డ ఒక‌రినొక‌రు అపురూపంగా చూసుకుంటున్న ఫోటోల‌ను షేర్ చేశాడు విఘ్నేశ్. థాయ్‌లాండ్‌లోని ఒక రిసార్ట్‌లో ఉన్న‌ట్లు తెలిపాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. సెల‌బ్రిటీల‌తో పాటు ఫ్యాన్స్ కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. Courtesy Instagram: Vignesh Shivan Courtesy Instagram: Vignesh Shivan

  తిరుమ‌ల వివాదంపై క్ష‌మాప‌ణ‌లు కోరిన విఘ్నేశ్ శివ‌న్

  తిరుమ‌ల మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరిగారంటూ కొత్త జంట న‌య‌న‌తార‌-విఘ్నేశ్‌ల‌పై వివాదం చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. వీరిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు కూడా టీటీడి సిద్ధ‌మైంది. అయితే తాజాగా దీనిపై క్ష‌మాప‌ణ కోరుతూ విఘ్నేశ్ శివ‌ను లేఖ‌ను విడుద‌ల చేశాడు. శ్రీవారిపై మాకు అపార‌మైన భ‌క్తి ఉంద‌ని చెప్పాడు. అస‌లు పెళ్లి ఇక్క‌డే చేసుకోవాల‌నుకున్నాం, అందుకే నెల‌లో 5 సార్లు తిరుప‌తికి వ‌చ్చాం, కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేద‌ని చెప్పాడు. అందుకే పెళ్లి అయిన వెంట‌నే శ్రీవారిని ద‌ర్శించుకొని, ఒక ఫోటోషూట్ చేసుకుంటే … Read more

  న‌య‌న‌తార‌-విఘ్నేశ్ శివ‌న్‌ల పెళ్లి ఫోటో వ‌చ్చేసింది

  న‌య‌న‌తార-విఘ్నేశ్ శివ‌న్‌ల పెళ్లి నేడు మ‌హాబ‌లిపురంలో ఘ‌నంగా జ‌రిగింది. పెళ్లి వేడుక‌కు సంబంధించిన ఫోటోను విఘ్నేశ్ సోష‌ల్‌మీడియా ద్వారా పంచుకున్నాడు. న‌య‌న‌తార పింక్ క‌ల‌ర్ శారీలో మ‌హారాణిలా మెరిసిపోతుండ‌గా, విఘ్నేశ్ క్రీమ్ క‌ల‌ర్ డ్రెస్‌తో ముస్తాబ‌య్యాడు. న‌య‌న‌తారు నుదుటిపై ముద్దుపెడుతూ త‌న ప్రేమ‌ను చూపుతున్నాడు. మా త‌ల్తిదండ్రులు, స్నేహితుల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నామ‌ని తెలిపాడు.