వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక!
ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ యాప్‌ని వాడుతున్న భారతీయులు, యూజర్లకు వాట్సాప్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. సేమ్ వాట్సాప్ మాదిరిగా ఉన్న నకిలీ వెర్షన్ వచ్చినట్లు తెలిపింది. తమ సంస్థ సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ వాట్సాప్ తరహాలో సేవలు అందిస్తున్న “Hey WhatsApp”ను గుర్తించినట్లు పేర్కొంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులకు కొన్ని కొత్త ఫీచర్లు ఉంటాయని చెప్పింది. కానీ ఆ యాప్ ద్వారా వినియోగదారుల సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో దానిని డౌన్లోడ్ చేసుకోకూడదని కోరింది.