• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడే రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు

    భారత దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టనుండగా.. సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొదట ఎంపీల ఓట్లు లెక్కించనుండగా.. అనంతరం ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించనున్నారు. ఈనెల 25వ తేదీన నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి ద్రౌపది ముర్ము పోటీ చేయగా.. విపక్షాల నుంచి యశ్వంత్ సిన్హా పోటీ చేశారు. © ANI Photo © ANI Photo © … Read more

    నేడే రాష్ట్రపతి ఎన్నికలు

    భారత దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్‌తో పాటు వివిధ రాష్ట్ర అసెంబ్లీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దేశ 16వ రాష్ట్రపతిగా బీజేపీ తరఫున ద్రౌపది ముర్ము పోటీ చేస్తుండగా.. విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. అయితే అధికార భాజపా, ఎన్డీఏ కూటమికి మెజార్టీ ఉండడంతో ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే కానుంది. © … Read more

    హైదరాబాద్ చేరుకున్న యశ్వంత్ సిన్హా

    రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట నుంచి జలవిహార్ వరకు ర్యాలీ మొదలైంది. ఈ నేపథ్యంలో TRS ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. అనంతరం కేసీఆర్‌తో కలిసి విందు చేయనున్నారు. కాగా నేడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌‌లో జరగనుండగా.. దీనికి పీఎం నరేంద్ర మోడీ కూడా హాజరు కానుండడంతో హైదరాబాద్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. © ANI Photo © ANI Photo

    హైదరాబాద్‌లో నెలకొన్న టెన్షన్ వాతావరణం

    భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశాల్లో భాగంగా నేడు పీఎం నరేంద్ర మోడీ హైదరాబాద్ రానున్నారు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు. అటు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సైతం ప్రచారంలో భాగంగా నేడు హైదరాబాద్‌ రానున్నారు. దీంతో బీజేపీ, TRS పార్టీల నేతలు నగరాన్ని ఫ్లెక్సీలతో నింపేశారు. దీంతో నగరంలో ఏదో హోలీ పండుగా జరుగుతున్నట్లు రోడ్లన్నీ దర్శనమిస్తున్నాయి. అయితే ఇద్దరు జాతీయ నేతలు హైదరాబాద్ రావడంతో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు సరైన ప్రోటోకాల్ పాటించడం … Read more

    జులై 2న హైదరాబాద్ కు యశ్వంత్ సిన్హా

    విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా… జులై 2న హైదరాబాద్ వస్తున్నారు. ప్రచారంలో భాగంగా తనకు మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కాంగ్రెస్, మజ్లిస్ ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోదీ కూడా…రెండో తారీఖునే హైదరాబాద్‌ వస్తున్నారు. దీంతో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలకాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో పాటు నేతలను కేసీఆర్ ఆదేశించారు.

    విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా

    – విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా – విపక్షాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం – అధికారికంగా ప్రకటించిన జైరాం రమేష్ – 2018లో బీజేపీకి రాజీనామా చేసిన యశ్వంత్ సిన్హా – యశ్వంత్ సిన్హాకు 22 పార్టీల మద్దతు – బరిలోకి మాజీ మంత్రి, టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్, అన్ని పదవులకు రాజీనామా