నవంబర్‌లో పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు సరికొత్త మొబైల్స్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాయి. దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రేంజ్లో మొబైల్స్ రిలీజ్ చేస్తుండగా.. మరికొన్ని ఫ్లాగ్షిప్ ఎడిషన్‌లో కొత్త మొబైల్స్‌ను విడుదల చేయనున్నాయి. మరి నవంబర్‌లో ఏ కంపెనీల నుంచి స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి? వాటి ధర, ప్రత్యేకతలపై ఓ లుక్ వేద్దాం పదండి.
1. OnePlus Ace 2 Pro
వన్‌ప్లస్ నుంచి మరో ఫ్లాగ్ షిప్ ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. నవంబర్ 23న ఈ ఫోన్ రిలీజ్ కానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ ఈ ఫోన్ గురించి కొన్ని లీక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీని ధర భారత్‌లో రూ. 34,290 ఉండే అవకాశం ఉంది. మిగతా వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఇది కూడా ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. ప్రధాన కెమెరా 50 MP + 8 MP + 2 MP కన్ఫిగరేషన్లో ఉండనుంది. ఇక సెల్ఫీ కెమెరా 16MP మెగాఫిక్సెల్తో రానుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉండనుంది. ఆక్సిజన్ ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 13పై రన్ కానుంది.
2. Xiaomi Redmi Note 13 Pro
రెడ్ మీ నోట్ 13 ప్రో నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్లో విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నోట్ ఫోన్ల కంటే ఇది పవర్‌పుల్ చిప్ సెట్‌తో రానుంది. స్నాప్ డ్రాగన్ 7s జనరేషన్ 2 చిప్ సెట్‌తో అందుబాటులో ఉండనుంది. 200MP ప్రధాన కెమెరా, 6.67 అంగుళాల లార్జ్ డిస్ప్లే, డ్యూయల్ కలర్ ఎల్ఈడీ ఫ్లాష్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. బ్యాటరీ కెపాసిటీ 5100mAh ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. దీని ధర రూ.17,390 ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
3. iQOO Neo 8
iQOO Neo 8 నవంబర్ 13న భారత మార్కెట్లోకి విడుదల కానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 2 చిప్ సేట్‌తో రానుంది. 6.78 అంగుళాల డిస్ప్లే, 50MP+2MP ప్రధాన కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాతో రానుంది. 453ppi బ్రైట్నెస్ సూపర్ ఆమోల్డ్ డిస్ప్లేతో రానుంది. 12జీబీ ర్యామ్, 128, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో మార్కెట్లోకి విడుదల కానుంది. దీని ధర రూ. 29,390 ఉండే అవకాశం ఉంది.
4. vivo S17
వివో నుంచి వస్తున్న మరో ఫ్లాగ్ షిప్ ఫోన్ vivo S17. దీనిని ప్రీమియం ఫీచర్లతో నవంబర్ 15న భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు వివో సిద్ధమైంది. 6.78 అంగుళాల 453ppi ఆమోల్డ్ డిస్ప్లే 120 హెడ్జ్ రిఫ్రేష్ రేటుతో రానుంది. మెయిన్ కెమెరా 50MP+8MP డ్యూయల్ సెటప్‌తో రానుంది. ఫ్రంట్ కెమెరా 50 MP డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ. 29,060 వరకు ఉండే అవకాశం ఉంది.
5. POCO F5 Pro
పోకో నుంచి ఇది మరో ఫ్లాగ్ షిప్ ఫోన్. దీనిని ఇండియన్ మార్కెట్లోకి నవంబర్ 3న రిలీజ్ చేసేందుకు పోకో సిద్ధమైంది. ఇక దీని ఫీచర్ల విషయానికి వస్తే… 6.67 అంగుళాల డిస్ప్లే 526ppi బ్రైట్‌నెస్‌తో మృదువైన 120హెడ్జ్ రిఫ్రేష్ రేట్‌ను కలిగి ఉండనుంది. మెయిన్ కెమెరా 64 MP + 8 MP + 2 MP సెటప్‌తో ప్రైమరీ కెమెరా 16MPతో రానుంది. 5160 mAh బ్యాటరీ కెపాసిటితో టర్బో ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ. 36,890 ఉంటుందని అంచనా వేస్తున్నారు.
6. Xiaomi Redmi Note 12T Pro
రెడ్మీ నోట్ 12T ప్రో స్మార్ట్ ఫోన్ నవంబర్ 2న విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం.. ఇది పవర్ఫుల్ చిప్ సెట్ మీడియా టెక్ డైమెన్సిటీ 8200 MT6896Z ప్రాసెసర్‌తో రానున్నట్లు సమాచారం. 6.6 అంగుళాల డిస్ప్లేతో 407ppi బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా 64 MP + 8 MP + 2 MP సెటప్‌తో రానుండగా, ఫ్రంట్ కెమెరా 16MPతో అందుబాటులో ఉండనుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 5080 mAh ఉండి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.18,690 ఉండే అవకాశం ఉంది.
7.Honor 90 Pro
హానర్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ నవంబర్ 20న రిలీజ్ కానుంది. హానర్ 90 ప్రో స్మార్ట్ ఫోన్ 6.78 సూపర్ ఆమోల్డ్ డిస్ప్లే 437ppi బ్రైట్ నెస్‌తో 120 హెడ్జ్ రిఫ్రేష్ రేటుతో రానుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉండనుంది. దీని ప్రధాన కెమెరా వచ్చేసి 200 MP + 12 MP + 32 MP సెటప్‌తో రానుండగా.. ఫ్రంట్ కెమెరా 50 MP + 2 MP కన్ఫిగరేషన్‌తో అందుబాటులో ఉండనుంది. 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో ఫాస్ట్ 63W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 38,990 వద్ద ఉండే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!