ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో వీవోకు మంచి బ్రాండ్ ఈమేజ్ ఉంది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్లకు యూత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే వివో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్స్ విడుదల చేస్తూ మెుబైల్ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే కొత్తగా ‘Vivo X100 Series’ లాంఛ్ చేసేందుకు వివో సిద్ధమైంది. నవంబర్ 11న Vivo X100 Series మోడల్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. తొలుత Vivo X100, Vivo X100 ప్రో లాంచ్ చేయాలని చూస్తోంది. ఈనేపథ్యంలో Vivo X100 Series మోడల్స్ స్పెసిఫికేషన్స్‌పై ప్రత్యేక కథనం మీకోసం..
మోడల్స్
‘Vivo X100 Series’ సిరీస్‌ను Vivo X90 సిరీస్‌కు అప్‌గ్రెడేడ్‌గా తీసుకొస్తున్నారు. మెుత్తం మూడు వేరియంట్లలో ఈ ఫోన్ రానుంది. ‘Vivo X100’, ‘Vivo X100 Pro మోడళ్లు నవంబర్‌లో విడుదల కానుండగా..’Vivo X100 Pro+’ మాత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
డిస్‌ప్లే
Vivo X100 సిరీస్‌ను AMOLED డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. డిస్‌ప్లే 6.82 అంగుళాల పొడవుతో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 386ppi వద్ద పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ సిరీస్‌లోని Vivo X100, Vivo X100 ప్రో మోడళ్లు MediaTek Dimensity 9300 చిప్‌సెట్‌తో రానున్నట్లు లీక్స్ అందాయి. Vivo X100 ప్రో+ మాత్రం లెటెస్ట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్‌తో రానుంది.
ఆపరేటింగ్ సిస్టమ్
ఈ గ్యాడ్జెట్ సిరీస్ లెటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ 14పై రన్ కానుంది. Funtouch OS ఆధారంగా పనిచేయనుంది.
కెమెరా క్వాలిటీ
Vivo X100 సిరీస్ కెమెరా నాణ్యతను వివో భారీగా పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. బేస్ మోడల్‌లో Vivo X100లో ప్రధాన కెమెరా.. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. 64 MP( Primary Camera),12 MP( Ultra-Wide Angle Camera),12 MP(Telephoto Camera) కాన్ఫిగరేషన్‌తో రానుంది. అయితే Pro, Pro plus వేరియంట్ ప్రైమరీ కెమెరా ఏకంగా 200MP వరకూ ఉండొచ్చని తెలిసింది. అన్ని మోడల్స్‌లో ఫ్రంట్ కెమెరా/ సెల్ఫీ కెమెరా 34MPతో రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
పవర్‌ఫుల్ బ్యాటరీ
Vivo X100 సిరీస్‌ను శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది ఏకంగా 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. అదే నిజమైతే మెుబైల్‌ను క్షణాల్లో 100% ఛార్జ్ చేసుకోవచ్చు.
స్టోరేజ్ కెపాసిటి
Vivo X100 సిరీస్ 12GB/16GB ర్యామ్ వేరియంట్లలో 256జీబీ/1TB స్టోరేజ్ కెపాసిటీతో మోడల్స్ అందుబాటులో ఉండనున్నాయి.
5G సపోర్ట్
Vivo X100 సిరీస్‌లోని అన్ని మోడల్ ఫోన్స్ 5G సపోర్ట్‌తో రానున్నాయి. ఇవి ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
వాటర్ రెసిస్టెన్స్
Vivo X100 సిరీస్‌లోని Pro, Pro+ మోడళ్లను వాటర్ రెసిస్టెన్సీతో తీసుకొస్తున్నారు. ఇది వాటర్, దుమ్ము-దూళిని తట్టుకునే IP68 రేటింగ్‌ను అందించారు.
ధర ఎంతంటే?
Vivo X100 సిరీస్‌కు సంబంధించిన ధరలను వివో అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ సిరీస్‌లోని బేసిక్ మోడల్ ధర రూ. 43,990 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీన్ని బట్టి Pro, Pro+ మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!