• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Waterfalls Near Hyderabad: వర్షకాలం.. ఈ జలపాతాలకు  కపుల్స్‌తో వెళ్తే ఆ మాజాయే వేరు!

    వర్షకాలంలో జలపాతలు కదం తొక్కుతుంటాయి. జల జల పారూతూ కనుల విందును కలిగిస్తుంటాయి.  కొండ అంచుల నుంచి సొగసుగా జాలువారే నీటి తుంపర్లు.. చక్కని ఆహ్లదాన్ని పంచుతాయి. ఎప్పుడు పని ఒత్తిడితో బిజీ బిజీగా గడిపే హైదరాబాద్ వాసులు ఈ జలపాతలను సందర్శించి కాస్త ఉపశమనం పొందండి మరి. మీకు దగ్గరలో జలపాతాలు ఎక్కడ ఉన్నాయని ఆలోచిస్తున్నారా?  హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ఈ జలపాతాలను ఓసారి చూసిరండి.

    తదిమడ జలపాతం

    తదిమడ జలపాతం అనంతగిరి కొండల్లో ఉంది.  ఇది హైదరాబాద్ నుంచి 82 కి.మీ దూరంలో ఉంది.  అనంతగిరి కొండల నుంచి ట్రెక్కింగ్ ద్వారా జలపాతానికి చేరుకోవచ్చు.  100 అడుగుల ఎత్తులో గల తదిమడ జలపాతాలను సందర్శించడానికి వర్షాకాలం అనువైన సమయం.

    ఎత్తిపోతల జలపాతం 

    ఇది నాగార్జున సాగర్ నుంచి కేవలం 14 కిమీల దూరంలో ఉంటుంది. నాగార్జున సాగర్ సందర్శించినవారు కచ్చితంగా ఈ జలపాతానికి వెళ్లడానికి మొగ్గుచూపుతారు.  హైదరాబాద్‌ నుంచి 173 కిమీల దూరంలో ఈ జలపాతం అయితే ఉంది. కృష్ణానది ఉపనదైన చంద్రవంక నది మీద ఎత్తిపోతల జలపాతం ఏర్పడింది. దాదాపు 70 అడుగుల ఎత్తు నుంచి జలపాతం కిందకు దూకుతుంటే  సూపర్బ్ ఫీలింగ్ కలుగుతుంది.

    మల్లెల తీర్థం 

    రోడ్ ట్రిప్‌ ద్వారా నల్లమల అడవులను సందర్శిస్తూ జలపాతం సొగసులు ఆస్వాదించాలనుకునేవారికి మల్లెల తీర్థం ఉత్తమ గమ్యస్థానం. హైదరాబాద్‌కు మల్లెల తీర్థం 170 కిమీల దూరంలో ఉంటుంది. శ్రీశైలానికి 58 కి.మీల దూరంలో నల్లమల అడవుల్లో ఈ జలపాతం ఏర్పడింది. ఈ జలపాతంలో స్నానాలు చేయాలంటే దాదాపు 250 మెట్లు దిగి కిందికి వెళ్లాలి.

    భీముని పాదం జలపాతం

    వరంగల్ నుంచి 51 కిమీల దూరంలోనూ.. హైదరాబాద్‌ నుంచి 200కి.మీ దూరంలోనూ ఈ జలపాతం ఉంది. వరంగల్ జిల్లాలోని గూడూరు మండలం సీతానాగారం గ్రామంలో ఈ జలపాతం సవ్వడులు చేస్తోంది. ఈ జలపాతం విశిష్టత ఏమిటంటే.. అన్ని కాలాల్లోనూ ఇది ప్రవహిస్తుంటుంది. లాంగ్ ట్రిప్‌కు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి డెస్టినేషన్.

    కుంతల జలపాతం

    తెలంగాణలోనే ఈ జలపాతం అతిపెద్దది. గోదావరి ఉపనది కడెం మీద ఏర్పడింది. సహ్యాద్రి పర్వతాల మీద నుంచి దాదాపు 45 మీటర్లు ఎత్తు నుంచి జలపాతం దూకుతుంటే భలే మజా వస్తుంది. ఇది హైదరాబాద్ నుంచి ఇది 270 కి.మీ దూరంలో ఉంటుంది. పూర్వం ఈ జలపాతంలో శకుంతల స్నానం ఆచరించడం వల్ల ఈ జలపాతానికి కుంతల జలపాతం అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఈ జలపాతం కింద ఉండే గుహలో సొమేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి. అక్కడకు వెళ్లిన పర్యాటకులు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ.

    పోచెర జలపాతం 

    ఇది దట్టమైన అడవుల మధ్య ఉండటంతో చాలా కాలం వరకు దీనిని గుర్తించ లేదు. ఈ జలపాతం  హైదరాబాద్‌కు 257 కిమీల దూరంలో ఉంటుంది. ఆదిలాబాద్‌ నుంచి అయితే 50 కి.మీల దూరం వస్తుంది. పొచ్చెర జలపాతానికి చేరేందుకు బోద్‌క్రాస్ రోడ్డు నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇది కుంతాల జలపాతానికి 22 కి.మీ దూరంలో ఉంటుంది. రెండు చూసేందుకు ఒకేసారి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది.

    బొగతా జలపాతం

    హైదరాబాద్ నుంచి లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లి ప్రకృతి అందాలు ఎంజాయ్ చేయాలనునే వారికి బొగతా జలపాతం మంచి వ్యూపాయింట్. ఇక్కడ జలపాతం అందాలతో పాటు అటవీ అందాలను వీక్షించవచ్చు. ఇది హైదరాబాద్‌ నుంచి 300 కి.మీ దూరంలో ఉంటుంది. భద్రాచలానికి 120 కి.మీ.దూరంలో చత్తీస్‌గడ్ దండకారుణ్యం నుంచి ప్రవహించే గోదావరి నదిపై ఈ జలపాతం ఏర్పడింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv