Xiaomi 14 Pro (HyperOS) : ఐఫోన్ 15తో పోటీ… కొత్తగా ఇందులో ఏముందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  •  Xiaomi 14 Pro (HyperOS) : ఐఫోన్ 15తో పోటీ… కొత్తగా ఇందులో ఏముందంటే?

     Xiaomi 14 Pro (HyperOS) : ఐఫోన్ 15తో పోటీ… కొత్తగా ఇందులో ఏముందంటే?

    October 30, 2023

    భారత మార్కెట్‌లో టాప్ సెల్లింగ్ బ్రాండ్‌లలో రెడ్‌మీ ఒకటి. చైనీస్ కంపెనీ అయిన షావోమీ(Xiaomi) ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మొబైల్ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఇటీవలే పలు మోడళ్లను రిలీజ్ చేసిన షావోమీ..  తాజాగా Xiaomi 14 ప్రోను లాంచ్ చేసింది. ఎన్నడూ లేని విధంగా ఈ గ్యాడ్జెట్‌లో తొలిసారి సొంత ఆపరేటింగ్ సిస్టం HyperOS షావోమి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ గురించి మరిన్ని ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం.

    డిజైన్ & డిస్‌ప్లే

    కంప్లీట్ అల్ట్రా న్యారో ఫ్లాట్ డిజైన్‌తో  Xiaomi 14 Pro వచ్చింది. సిరామిక్ గ్లాస్‌తో తయారు చేయడం వల్ల స్టైలీష్ లుక్‌ను అందిస్తుంది. ఈ గ్లాస్ 10 రెట్లు అధికమైన డ్రాప్ రెసిస్టెన్స్‌తో పాటు 1.25 రెట్లు ఎక్కువ స్క్రాచ్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.  LTPO ఆమోల్డ్ HDR10+, 3000nits పీక్ బ్రైట్‌నెస్‌తో కర్వ్డ్‌ డిస్‌ప్లే ఉంది. దీనివల్ల ఎక్సలెంట్ క్వాలిటీతో, ఇమేజ్‌లు, వీడియోలు అయితే కనిపిస్తాయి. ఇక IP68 డస్ట్/వాటర్ రెసిస్టెంట్‌(1.5m/30min)ను కలిగి ఉంది.  6.73 అంగుళాల లార్జ్ డిసెప్లే అట్రాక్ట్ చేస్తుంది. స్క్రీన్ అస్పెక్స్ రెషియో 20:9 వరకు ఉంది. డాల్బీ విజన్‌ను స్పాన్సర్ చేస్తుంది.

    ప్రాసెసర్( Xiaomi 14 Pro Processor)

    Xiaomi 14 మాదిరి 14 ప్రో కూడా స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్‌(Qualcomm Snapdragon 8 Gen 3)తో వచ్చింది. దీని జీపీయూ Adreno 750 చిప్‌తో నడుస్తుంది. తద్వారా గేమింగ్, ఎడిటింగ్‌ను ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్‌ లేకుండా చేసుకోవచ్చు. ఇక ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14, MIUI 14పై రన్‌ అవుతుంది.

    కెమెరా(Xiaomi 14 Pro camera) 

    రెడ్‌మీ 14 ప్రో గ్యాడ్జెట్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. మెయిన్‌ కెమెరా వచ్చేసి 50MP(Wide)+  50MP(Telephoto)+ 50MP(ultrawide) కాన్ఫిగరేషన్‌లో వచ్చింది. ఈ ప్రధాన కెమెరాతో 8K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు.  ఇక సెల్ఫీ కెమెరా విషయానికొస్తే.. 50 మెగా పిక్సెల్‌తో ప్రైమరీ కెమెరా వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రైమరీ కెమెరా HDR, పనోరామ ఫీచర్లను కలిగి ఉటుంది. ఫ్రంట్ కెమెరాతో 4K క్వాలిటీతో వీడియోలు అయితే రికార్డు చేయవచ్చు. 

    బ్యాటరీ కెపాసిటీ (Xiaomi 14 Pro Battery)

    Xiaomi 14 ప్రో గ్యాడ్జెట్ 4800mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉటుంది. మరో విశేషమేమిటంటే ఇది వైర్‌లెస్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపొర్ట్ చేస్తుంది. వైర్‌డ్ ఛార్జింగ్ అయితే 120W ఫాస్ట్ ఛార్జింగ్,  వైర్‌లెస్‌ అయితే 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 

    Xiaomi 14 Pro కలర్స్

    ఈ గ్యాడ్జెట్  జాడే గ్రీన్ (Jade Green), బ్లాక్, వైట్, స్నో మౌంటెన్ పింక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. పింక్, జాడే గ్రీన్ కలర్స్‌ ప్రీమియం లుక్స్‌ అయితే అందిస్తాయి. 

    స్టోరేజ్

    8-16 జీబీ ర్యామ్‌తో 512జీబీ స్టోరేజ్ కెపాసిటీతో Xiaomi 14 ప్రో అందుబాటులో ఉండనుంది. స్టోరేజ్ సామర్థ్యాన్ని అవసరాన్ని బట్టి 1TB వరకు పెంచుకోవచ్చు.

    తొలి సారిగా  HyperOS

    14 ఆండ్రాయిడ్ లెటెస్ట్ వెర్షన్ 14పై రన్‌ అవుతున్నప్పటికీ.. తొలిసారిగా తాను అభివృద్ధి చేసిన HyperOSను ఈ ఫోన్‌లో రెడ్‌మీ తీసుకొచ్చింది. ఇది ఆపిల్ iOS వంటి ఆపరేటింగ్ ఎకో సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్  తమ కంపెనీ నుంచి ఉత్పత్తి అయ్యే స్మార్ట్ పరికరాల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేసినట్లు  రెడ్‌మీ తెలిపింది. స్మార్ట్ వాచ్‌లు, గృహోపకరణాలు, ఇయర్ బడ్స్, కార్లు వంటివి ఈ ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంతో రన్‌ కానున్నాయి. ఈ HyperOS ప్రధానంగా తక్కువ-స్థాయి రీఫ్యాక్టరింగ్, క్రాస్-ఎండ్ ఇంటెలిజెంట్ కనెక్టివిటీ, ప్రోయాక్టివ్ ఇంటెలిజెన్స్, ఎండ్-టు-ఎండ్ సెక్యూరిటీ లక్ష్యంగా పనిచేయును.

    సెన్సార్స్

    గత రెడ్‌మీ ఫోన్లలో ఎలాంటి సెన్సార్లు అందుబాటులో ఉన్నాయో ఇందులోనూ కొనసాగిస్తున్నారు. ఆఫ్టికల్ ఫింగర్ ఫ్రింట్ డిస్‌ప్లే, కంపాస్, గైరో, కలర్ స్పెక్ట్రం వంటి సెన్సార్లను పొందుపరిచారు.

    Xiaomi 14 Pro ధర:

     ఇండియన్‌ మార్కెట్‌లో Xiaomi 14 ప్రో ధర రూ 56,890గా నిర్ణయించారు. ఒక్కసారి ఇది ఆన్‌లైన్‌లో సెల్స్‌కు వచ్చాక.. దీనిపై బ్యాంక్ ఆఫర్స్‌ అయితే రానున్నాయి. ఫలితంగా దీని ధర మరింత తగ్గే అవకాశం అయితే ఉంటుంది.

    ఎప్పుడు అందుబాటులోకి?

    నవంబర్ తొలి వారంలో Xiaomi 14 ఆతర్వాత 14 ప్రో  సేల్స్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version