బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి యూట్యూబ్ ఛానల్లో కొత్త కొత్త ఐడియాస్ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. వాళ్ల అమ్మతో కలిసి కూడా వీడియోలు చేస్తుంటుంది. అయితే రీసెంట్గా వాళ్ల అమ్మతో నేను ప్రెగ్నెంట్ అంటూ చేసిన ప్రాంక్ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మమ్మీతో చాలా మెమరీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో. దయచేసి ఎవరు నన్ను తిట్టకండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరూ నన్ను హేట్ చేయొద్దు అని ముందే చెప్పేసింది అషు. ఇక ప్రాంక్ స్టార్ట్ చేసేందుకు రంగంలోకి దిగింది. వాళ్ల అమ్మకు కనిపించకుండా రెండు ఫోన్లు పెట్టి కెమెరా యాంగిల్స్ సెట్ చేసుకుంది. మరో ఫోన్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి సోఫాలో కనిపించకుండా పెట్టింది.
రెండు నెలల నుంచి నాకు పీరియడ్స్ రావట్లేదు. అందుకని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. పాజిటివ్ అని వచ్చింది. నేను ప్రెగ్నెంట్ మమ్మీ అని చెప్పింది అషు. వాళ్ల మమ్మీకి ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు. ఏం మాట్లాడకుండా అలా కూర్చుండిపోయింది. తర్వాత మెల్లిగా ఏం చేద్దాం మమ్మీ అని అడిగింది అషూ..ఏం చేసేదేంటి ఏదైనా తాగి చచ్చిపోదాం అని సీరియస్‌గా ఆన్సర్ ఇచ్చింది. చచ్చిపోవడం ఎందుకు బేబీని పెంచుకుందాం.. అని మరింత కోపం తెప్పించింది అషు. దీంతో వాళ్ల అమ్మ ఒక్కసారిగా లేచి అషును కొట్టడం స్టార్ట్ చేసింది, తన్నింది కూడా. వద్దు మమ్మీ అంటున్న వినలేదు. అందుకే అమెరికా వెళ్లి చక్కగా జాబ్ చేసుకోమని చెప్పా అని తిట్టింది. ఇలాంటి ఫ్రెండ్స్‌తో తిరిగితే ఇలాంటి బుద్దులే వస్తాయి. అందుకే వీళ్లతో తిరగొద్దని చెప్పాను, అంటూ వాళ్లనూ తిట్టిపోసింది.
చివరికి నిన్ను ఇలా కాదు మీ డాడీకి చెప్తాను అని సీరియస్‌గా వెళ్లి ఫోన్ తీసుకొచ్చి..కాల్ డయల్ చేసింది. దీంతో వామ్మో మన కొంపలు మునిగిపోతాయి నిజంగానే చేప్పేస్తుందేమో అనుకొని.. ఫోన్ లాక్కొని ఇది నిజం కాదు మమ్మీ ప్రాంక్ అని రివీల్ చేశారు. కావాలంటే కెమెరాలు చూడు అని ఫోన్ చూపించింది. దీంతో రియలైజ్ అయిన వాళ్ల మమ్మీ ..ఇలాంటి ప్రాంక్ చేస్తావా అని ఇంకో నాలుగు తగిలించింది. అంతా వీళ్ల ప్లాన్ మమ్మీ వీళ్లను కూడా తిట్టు అని ఫ్రెండ్స్‌ని ఇరికించింది అషు. నిజం చెప్పాలంటే అషు కంటే ఎక్కువ వాళ్ల ఫ్రెండ్స్ యాక్టింగ్ ఇరగదీశారు. అషుకి ఒకవైపు నవ్వొస్తున్నా..వాళ్ల ఫ్రెండ్స్ కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు.
మీ మమ్మీ సూపర్. ఎపిక్ రియాక్షన్. ఫుల్‌గా నవ్వుకున్నాం..మీరంతా కలిసి మమ్మల్ని ప్రాంక్ చేశారు అని వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్ . మీ ఫ్రెండ్స్ యాక్టింగ్ సూపర్ అని చెప్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియలో వైరల్‌గా మారింది. ఫుల్ కామెడీగా ఉన్న ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి