థియేటర్లలో పూనకాలే అంటున్న నెటిజన్లు
కన్నడ నటుడు యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. భారత చలనచిత్ర పరిశ్రమను నెలబెట్టిన సినిమాల్లో కచ్చితంగా కేజీఎఫ్ ఉంటుంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలు రికార్డు వసూళ్లను రాబట్టాయి. ముఖ్యంగా కేజీఎఫ్-2 చిత్రం రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్స్‌ను అధిగమించాయి. అయితే పార్ట్-2 హీరో సముద్రంలో మునిగిపోయినట్లు చూపించిన ప్రశాంత్ నీల్ మరణించినట్లు ధ్రువీకరించలేదు. దీంతో కచ్చితంగా పార్ట్-3 ఉంటుందని బలమైన సంకేతాలు వెళ్లాయి. ఇందుకు అనుగుణంగానే తాజాగా KGF మేకర్స్ పార్ట్-3పై ఆశలు కలిగించారు.
KGF-2 సినిమా రిలీజై నేటితో (ఏప్రిల్ 14) ఏడాది పూర్తైన సందర్బంగా మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. సినిమాలోని ప్రతీ పాత్రను తిరిగి గుర్తు చేస్తూ ఆ వీడియో సాగింది. ‘మరపురాని క్యారెక్టర్లు, యాక్షన్ ప్రయాణం అద్భుతంగా సాగింది. ప్రపంచ రికార్డులతో పాటు అనేక హృదయాలను గెలుచుకున్నాం’ అంటూ మేకర్స్ క్యాప్షన్ పెట్టారు. అమ్మకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది.. మరి నెరవేరిందా? అని మూడో పార్ట్‌పై హింట్ ఇచ్చారు. దీనిని మేకర్స్ చేసిన అధికారిక ప్రకటనగా భావించిన నెటిజన్లు #KGF3, #PrashanthNeel హ్యాష్‌ట్యాగ్‌లను తెగ ట్రెండ్ చేస్తున్నారు. కేజీఎఫ్2, సలార్ చిత్రాలను కలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
కేజీఎఫ్2, సలార్ చిత్రాల అనుసంధానంగా కేజీఎఫ్-3 రానుందని ఇప్పటినుంచే నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. ఈ మేరకు తమ అంచనాలను ట్విటర్‌లో పెడుతూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.
‘బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది డే’ అంటూ మరికొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. KGF-3 కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.
1978-81 మధ్య రాకీ భాయ్ ఎక్కడ ఉన్నాడని సదరు వీడియోలో మేకర్స్ ఓ ప్రశ్నను వదిలారు. అయితే దానికి సమాధానం పార్ట్-3 వస్తుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. కేజీఎఫ్-3 కూడా ప్రభంజనం సృష్టిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
థియేటర్‌లో అద్భుత అనుభూతిని పంచిన సినిమాల్లో కేజీఎఫ్ ఒకటని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. హీరో ఇంట్రో, క్లైమాక్స్ కోసమే మూడు సార్లు సినిమా చూశానని చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్-3 కోసం పిచ్చిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.
కేజీఎఫ్ 3 అంచనాలకు అందని రీతిలో ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మన ఊహాకు మించి సినిమా ఉండబోతుందని అభిప్రాయపడుతున్నారు.
షారుక్ ఖాన్ రీసెంట్ మూవీ పఠాన్ రికార్డులను KGF3 బద్దలు కొడుతుందని నెటిజన్లు అంటున్నారు. ఒకసారి సినిమా రిలైజ్ అయితే పటాన్ రికార్డ్స్ ఎక్స్‌పైరేనని ట్వీట్లు చేస్తున్నారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం