ప్రశాంత్ నీల్‌తో దిల్ రాజు చిత్రం
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు రూటు మార్చారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా చిత్రాలు తీస్తానని ప్రకటించారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా తీస్తున్నట్లు వెల్లడించారు. ఇది భారీ ఎత్తున నిర్మిస్తారట. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు రావణం అనే పేరు కూడా ఖరారు చేశారు. హీరో, హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్ల గురించి త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం దిల్ రాజు రామ్ చరణ్, శంకర్ సినిమా తెరకెక్కిస్తున్నారు.