• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • యశ్ ఇంటి ముందు ఫ్యాన్స్ బారులు

  కేజీఎఫ్‌ హీరో యశ్‌ ఇంటిముందు [ఫ్యాన్స్](url) బారులు తీరారు. అభిమాన నటుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని నిరాశ పరచొద్దని భావించిన యశ్.. ప్రతి ఒక్కరితో ఓపికగా ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ కన్నడ సూపర్‌ స్టార్ ఇప్పటివరకు కొత్త సినిమా ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. జనవరి 8న తన పుట్టినరోజు కూడా ఎలాంటి అప్డేట్‌ లేదు. అప్పుడు విదేశాల్లో ఉండగా.. తిరిగి రావటంతో ఫ్యాన్స్ తరలివచ్చారు. Fans Came to Meet … Read more

  700 మందితో స్టార్ హీరో సెల్ఫీలు

  కేజీఎఫ్ తో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న యశ్ చేసిన ఓ పనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన ఈ స్టార్ హీరో అక్కడికి వచ్చిన అభిమానులందరితో ఫోటో దిగారట. నిర్వాహకులు గ్రూప్ ఫోటోకి అనుమతించినప్పటికీ..వారితో మాట్లాడి ఏకంగా 700 మందితో ఫోటో దిగారని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు యశ్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారని, రియల్ సూపర్ స్టార్ అని ప్రశంసలు అందుతున్నాయి.

  మళ్లీ టాప్‌లో రష్మిక, యష్‌

  కన్నడ మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌ జాబితాలో మరోసారి రష్మిక, కేజీఎఫ్‌ స్టార్‌ యష్‌ అగ్రతారలుగా నిలిచారు. ఆర్మాక్స్‌ మీడియా ప్రతినెలా విడుదల చేసే ఈ జాబితాలో జులై మాసానికి కన్నడలో మోస్ట్ పాపులర్‌ ఫీమేల్‌ స్టార్‌గా రష్మి మంధాన నిలిచింది. అలాగే మోస్ట్‌ పాపులర్‌ మేల్‌ స్టార్‌గా యష్‌ స్థానం సంపాదించాడు. రెండో స్థానంలో సుదీప్‌, మూడో స్థానంలో దర్శన్‌, నాలుగో స్థానంలో ‘చార్లీ 777’ స్టార్‌ రక్షిత్ శెట్టి, ఐదో స్థానంలో శివన్న ప్రేక్షకుల ఆదరణ పొందారు. Courtesy Twitter:ormax media Courtesy … Read more

  కేజీఎఫ్-2లో రాఖీ భాయ్ పవర్ ఫుల్ డైలాగ్స్

  సినిమా ఇండస్ట్రీలో ఇటీవల వచ్చిన మాస్ సినిమాలన్నీ ఒకెత్తైతే ‘కేజీఎఫ్’ ఒక ఎత్తు. మురికి గుంట నుంచి ముంబయిని ఏలే స్థాయికి ఎదిగిన ఓ కుర్రాడి కథను.. అదిరిపోయే మాస్ ఎలివేషన్స్, అంతకుమించిన డైలాగ్స్ తో ‘కేజీఎఫ్’లో చూపించారు. అంతకు రెండింతల మాస్ సీన్లు, డైలాగ్స్ తో వచ్చింది ‘కేజీఎఫ్-2’. రాకీ భాయ్ నోట ఒక్కో పంచ్ డైలాగ్ పడుతుంటే థియేటర్లు ఊగిపోయాయి. అలా ‘కలాష్ నిఖావో’ రాకీ వదిలిన తూటాల్లాంటి  డైలాగ్స్ అక్షరాల్లో మీకోసం..

  తమిళ స్టార్ డైరెక్టర్‌కు యష్ గ్రీన్ సిగ్నల్ ?

  కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యష్. KGF-2 ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో తన తదుపరి ప్రాజెక్టును ఇంకా ప్రకటించలేదు. నర్తన్ అనే ఓ యువ దర్శకుడితో తరువాతి మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆ మూవీ తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో మూవీ చేయనున్నట్లు గాసిప్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్న శంకర్, తరువాత యష్‌ను డైరెక్ట్ చేయనున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత … Read more

  య‌శ్‌తో దిల్‌రాజు పాన్ఇండియా మూవీ!

  ‘కేజీఎఫ్’ స్టార్ యశ్‌తో ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ఒక పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నార‌ట‌. దీనికోసం ఆయ‌న య‌శ్‌కు రూ.100 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ట‌. దిల్ రాజు ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల‌ను నిర్మిస్తున్నాడు. గ‌తంలో జెర్సీ హిందీ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఇప్పుడు హిందీ హిట్ సినిమా చేస్తున్నాడు. య‌శ్ సినిమాతో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లోనూ సినిమాలు చేసేందుకు ప్ర‌ణాళిక వేసుకున్నాడు. ఇక‌పై తెలుగుతో పాటు అన్ని భాష‌ల చిత్రాల‌ను నిర్మించాల‌ని దిల్‌రాజు నిర్ణ‌యించుకున్నాడు.

  KGF 3 త‌ప్ప‌కుండా ఉంటుంది: ప్ర‌శాంత్ నీల్

  KGF వ‌ర‌ల్డ్‌కి ప్రేక్ష‌కులు చాలా బాగా క‌నెక్ట్ అయ్యారు. రాఖీబాయ్ క్యారెక్ట‌ర్‌ను చూసి చాలా ఎంజాయ్ చేశారు. కేజీఎఫ్‌3తో ఈ యూనివ‌ర్స్‌ను కొన‌సాగించే అవ‌కాశం త‌ప్ప‌కుండా ఉంది. కానీ దానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని ప్ర‌శాంత్ నీల్ తాజాగా వెల్ల‌డించాడు. కేజీఎఫ్‌3లో హృతిక్ రోష‌న్‌తో పాటు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రోవైపు తెలుగు న‌టులు కూడా ఇందులో ఉండ‌బోతున్నార‌ట‌. దీంతో సినిమా దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం బాహుబ‌లి, కేజీఎఫ్‌కు ఉన్న రికార్డుల‌ను తిర‌గరాస్తుంద‌ని ఆశిస్తున్నారు.

  రాఖీ భాయ్‌తో సందడి చేయనున్న పూజ ?

  బుట్టబొమ్మ పూజా హెగ్డే క్రేజ్ రోజు రోజుకూ పెరుగుకుంటూ పోతుంది. వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది ఈ అమ్మడు. ఇప్పటికే మహేష్, విజయ్ దేవరకొండ, సల్మాన్ ఖాన్ సినిమాల్లో నటిస్తున్న ఈ భామ.. తాజాగా పాన్ ఇండియా స్టార్ యష్ సినిమాలో నటించే అవకాశం కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. KGF హిట్ తరువాత యష్ నర్తన్ అనే దర్శకుడితో చేయనుండగా.. అందులో పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత … Read more

  అమెజాన్ ప్రైమ్‌లో ఉచితంగా KGF2

  KGF 2 మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ప్ర‌స్తుతం ‘పే ప‌ర్ వ్యూ’ ప‌ద్ధ‌తిలో అందుబాటులో ఉంది. అయితే జూన్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉచితంగా చూడ‌వ‌చ్చు. అన్ని భాష‌ల్లో ఎటువంటి అద్దె చెల్లించ‌కుండా సినిమాను చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో య‌శ్ న‌టించిన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.1200 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

  KGF ఛాప్ట‌ర్ 3 లో హృతిక్ రోష‌న్‌?

  KGF ఛాప్ట‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.1000 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. కేజీఎఫ్‌2లో ఇద్ద‌రు బాలీవుడ్ న‌టులు సంజ‌య్ ద‌త్, ర‌వీనా ఠండ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 3 గురించి మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. KGF3లో హృతిక్ రోష‌న్ న‌టించ‌నున్నాడ‌ని దాని సారాంశం. కేజీఎఫ్‌2 ఎండింగ్‌లో చాప్ట‌ర్ 3 కూడా ఉంటుంద‌ని హింట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ మ‌రి దాన్ని ఇంకా ఎంత … Read more