• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Apple iPhone 15 Price In India: అత్యంత శక్తివంతంగా iPhone 15..  కొత్తగా 5 ఫీచర్లు.. ధర కూడా అందుబాటులోనే!

    యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 5న ఐఫొన్ 15 సిరీస్‌ను అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. 2022లో విడుదలైన ఐఫోన్ 14 ప్రో, 14 మ్యాక్స్‌ ప్రో సిరీస్‌లు సూపర్ సక్సెస్ అయ్యాయి. అదే ఉత్సాహంతో కస్టమర్లకు మరింత అధునాతన ఫీచర్లతో ఐఫోన్ 15ను యాపిల్ కంపెనీ తీసుకొస్తోంది. ఐఫొన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి సోషల్ మీడియాలో కొన్ని లీక్స్ వైరల్ అవుతున్నాయి. వీటిపై ఓ లుక్కెద్దాం.

    నాలుగు మోడల్స్‌లో..

    ఐఫోన్ 14 సిరీస్‌ కంటే భిన్నంగా ఐఫోన్ 15 సిరీస్ నాలుగు మోడల్స్‌లో రానుంది. iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max వేరియంట్స్‌తో అదరగొట్టనుంది. సోషల్ మీడియాలో వస్తున్న ట్రెండ్స్ ప్రకారం.. ఈ నాలుగు మోడళ్లలో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో అదనపు ఫీచర్లు ఉంటాయని తెలిసింది. వీటిని ఐఫోన్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌ ఈ 5 రకాల మార్పులను కలిగి ఉంటాయాని భావిస్తున్నారు.

    1. Thinner bezels + titanium chassis: 

    ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌ను మిగతా మోడల్స్‌కు భిన్నంగా స్టెయిన్‌ లెస్ స్టీల్ ఫ్రేమ్‌కు బదులుగా టైటానియం ఫ్రేమ్‌తో తయారు చేయవచ్చని భావిస్తున్నారు. టైటానియం ఫ్రేమ్ వల్ల ఐఫోన్ 15 ప్రో మోడల్స్ అదపు ఆకర్షణ సొంతం చేసుకోనున్నాయి.

    2. USB-C port

    లీక్స్‌ను బట్టి ఐఫోన్ 15 సిరీస్‌ మోడల్స్.. USB-C port ను కలిగి ఉంటాయని తెలిసింది. ఈ మోడల్స్‌లోనే థండర్ బోల్ట్ పోర్టు కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఈ ఫోర్ట్ లైవ్‌ 4కే అవుట్‌పుట్ ఇవ్వడంలో సాయపడుతుంది. 

    3.Additional RAM:

    ఐఫోన్ 15 సీరీస్ ప్రో మోడల్స్‌లో ర్యామ్ అప్‌గ్రేడ్ అవుతుందని అంచనా. ఈ మోడల్స్‌లో 6GB నుంచి 8GB RAMకు అప్‌గ్రేడ్ కానుంది. తద్వారా గేమ్స్ ఎక్స్‌పీరియన్స్, మల్టీపుల్ టాస్క్ మెనేజింగ్ మరింత ఈజీకానుంది.

    4. Customizable mute button

    ఐఫోన్ 15 సిరీస్‌లో కస్టమైజబుల్ మ్యూట్ బటన్‌ను తీసుకురావాలని యాపిల్ భావిస్తోంది. దీనిని యాక్షన్ బటన్ అనికూడా అంటారు. తద్వారా వినియోగదారులు అదనపు ఫీచర్లను ఎనెబుల్ చేసుకునే ఛాన్సైయితే ఉంటుంది.

    5. A17 chip (3nm):

    యాపిల్ USP శక్తివంతమైన చిప్‌సెట్‌ను కలిగిఉంటుంది. యాపిల్ తన ప్రతి మోడల్స్‌లో ఈ చిప్‌సెట్‌ను అప్‌గ్రేడ్ చేస్తుంటుంది. ఐఫోన్ 14లో A16 బయోనిక్ చిప్‌ను ఇంటిగ్రేట్ చేసింది. త్వరలో విడుదల కానున్న యాపిల్ 15 ప్రో హ్యాండ్ సెట్లలో అత్యంత శక్తివంతమైన బయోనిక్ చిప్ A17తో అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిసింది.

    ఇక వీటితో పాటు కెమెరా సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు సమాచారం. లెన్స్ సామర్థ్యాన్ని Periscope zoom lens (up to 5x or 6x zoom) కి మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    ఐఫోన్ 15 సిరీస్ ధర:

    మార్కెట్ అంచనాల ప్రకారం ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్ ధర రూ.75,000- రూ.1,50,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

    ఈ ఏడాది విడుదల కానున్న ఇతర యాపిల్ ప్రొడక్ట్స్

    – Apple Watch Series 9

    – Apple Watch Ultra (2nd gen)

    – iPad (11th gen)

    – iPad Air (6th gen)

    – M3 MacBook Air models

    – M3 13 MacBook Pro

    – M3 24 iMac

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv