• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వడ్డీ లేకుండా ఈఎంఐలో స్మార్ట్ టీవీ!

  ఈఎంఐలో స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్. ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బచత్ సేల్’ నడుస్తోంది. ఈ సేల్‌లో ప్రముఖ బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కల్పిస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐ అందిస్తున్నాయి. 6 నెలల్లోగా నెలకు రూ.1,584 కడితే నో కాస్ట్ ఈఎంఐ వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ పేలేటర్ ద్వారా కూడా ఈఎంఐలో టీవీ కొనొచ్చు. ఐఫాల్కన్ 32 ఇంచుల టీవీ రూ.26,990గా ఉండగా ప్రస్తుతం రూ.9 వేలకే సొంతం చేసుకోవచ్చు.

  బడ్జెట్ ఎఫెక్ట్; దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

  కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రతికూలతలు లేకపోవడంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 300 పాయింట్లు ఎగబాకి 17,965 పాయింట్ల ఎగువన ట్రేడింగ్ జరుగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,200 పాయింట్లు లాభపడి 60,750 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. పవర్ గ్రిడ్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, గెయిల్ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. అతి కొద్ది కంపెనీల షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

  నేడే ఆఖరి ఫైట్; సీరీస్‌పై భారత్ గురి

  మూడు టీ20ల సీరీస్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్‌తో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది. అహ్మదాబాద్‌లో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సీరీస్ కొట్టేయాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. పృథ్వీ షాకు చివరి మ్యాచ్‌లోనైనా చోటు కల్పించే అవకాశాలు కనిపించడం లేదు. ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చే ఆస్కారం ఉంది. మరోవైపు సీరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించాలని కివీస్ పట్టుదలతో ఉంది.

  అతడి ముందు బుమ్రా ఎంత?: మాజీ ప్లేయర్

  ఇండియన్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాపై పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ పేసర్ షాహీన్ ఆఫ్రిదికి బుమ్రా దరిదాపుల్లోకి కూడా రాబోడని వ్యాఖ్యానించాడు. షాహీన్ ఆఫ్రిది అత్యుత్తమమని పేర్కొన్నాడు. గణాంకాల పరంగా ఇద్దరు ప్లేయర్లు దాదాపు సమానంగా ఉన్నప్పటికీ రజాక్ ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వెన్ను గాయంతో గతేడాది సెప్టెంబరు నుంచి బుమ్రా క్రికెట్ ఆడట్లేదు. ఆసీస్‌తో జరగనున్న 4టెస్టుల సిరీస్‌లో చివరి రెండు మ్యాచులకు బుమ్రా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

  నాన్ టెక్ జాబ్స్‌కు యమా డిమాండ్

  ఓ వైపు టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంటే.. నాన్ టెక్ కంపెనీలు మాత్రం నియామకాలు పెంచుతున్నాయని గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ తెలిపింది. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్,కన్‌స్ట్రక్షన్, ఫుడ్ సర్వీసెస్‌లో డిమాండ్ పుంజుకుందని పేర్కొంది. ఎక్కువ జాబ్ పోస్టింగ్స్ బెంగళూరు నుంచి ఉన్నట్లు ఇండీడ్ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, పుణె, చెన్నై నుంచి ఉన్నట్లు తెలిపింది. కరోనా ఆంక్షలు లేకపోవడంతో నాన్ టెక్ రంగంలో ఉద్యోగాల నియామకం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.

  భారతీయులకు గుడ్ న్యూస్

  భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే మార్చి 1 నుంచి హెచ్1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వీసాలు జారీ చేయనున్నట్లు పేర్కొంది. మార్చి 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అనంతరం లాటరీ పద్ధతి ద్వారా దరఖాస్తులు ఎంపిక చేసి వీసాలు జారీ చేస్తామని వివరించింది. కాగా ఏడాదికి 85 వేల హెచ్1బీ వీసాలను భారతీయులకు అమెరికా మంజూరు చేస్తుంది.

  మహిళా ప్లేయర్లకు కేటీఆర్ అభినందనలు

  అండర్-19 మహిళా ప్రపంచకప్‌ను గెలిచిన భారత్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్విటర్‌లో మహిళా క్రీడాకారులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. కెప్టెన్ షెఫాలీ వర్మ, తెలంగాణ క్రీడాకారిణి త్రిష చక్కగా రాణించారని కొనియాడారు. అండర్-19 విభాగంలో మహిళా ప్రపంచకప్‌ని నిర్వహించడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. టోర్నీలో ఆసాంతం టీమిండియా ఆధిపత్యం కనబరిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్‌ని 68 పరుగలకే కట్టడి చేసి.. 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది.

  టీమిండియా గ్రాండ్ విక్టరీ

  న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తుచేసింది. దీంతో 3 మ్యాచ్‌ల సీరీస్ 1-1తో సమమైంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 99 పరుగులకే చాప చుట్టేసింది. మిచెల్ శాంట్నర్ 24 పరుగులు చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ పొదుపుగా బౌలింగ్ వేసి 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు చేసి జట్టుకు విజయం చేకూర్చాడు.

  టీమిండియా గ్రాండ్ విక్టరీ

  న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తుచేసింది. దీంతో 3 మ్యాచ్‌ల సీరీస్ 1-1తో సమమైంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 99 పరుగులకే చాప చుట్టేసింది. మిచెల్ శాంట్నర్ 24 పరుగులు చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ పొదుపుగా బౌలింగ్ వేసి 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు చేసి జట్టుకు విజయం చేకూర్చాడు.

  భారత్ టార్గెట్ 100 రన్స్

  న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు అదరగొట్టారు. కివీస్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌట్ చేసి స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. దీంతో టీమిండియా లక్ష్యంగా 100 పరుగులుగా మారింది. అర్ష్‌దీప్ సింగ్ (2/7) ప్రతిభ చూపాడు. చాహల్, సుందర్, కుల్దీప్, హుడాలు తలో వికెట్ పడగొట్టి న్యూజిలాండ్ పతనం శాసించారు. కివీస్ జట్టులో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫిన్ అలెన్ 11, డెవాన్ కాన్వే 11, మార్క్ చాప్‌మాన్ 14 పరుగులు చేశారు.