పెద్ద పెద్ద సినిమా స్టార్లకు లేని ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ బుల్లితెర స్టార్లకు ఉంటుంది. వాళ్ళది ఓ కామెడీ క్లిప్ గానీ, యూట్యూబ్ వీడియో గానీ వస్తే చాలు ఆ వీడియో ట్రెండింగ్ లోకి వెళ్లాల్సిందే. ఒక్క ఫొటో షేర్ చేసినా, ఒక్క రీల్ చేసినా దానికి లైకుల మోత మోగాల్సిందే. అంతకు ముందు ఏమో కానీ, ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తరువాత కామెడీ షోలు, రియాలిటీ షోలు, డాన్స్ షోలు అంటూ చాలా మన ముందుకు వస్తున్నాయి. అలాంటి షోలను యువత ఎక్కువ ఆదరిస్తుండడంతో కొత్త కొత్త ట్యాలెంట్, కొత్త కొత్త వ్యక్తులు మనకు పరిచమై ఫేమస్ అవుతూ ఉంటారు. ఆ జాబితాలో టాలీవుడ్ స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఉంటుంది.
రష్మీ గౌతమ్ 2002లోనే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెరీర్ మొదట్లో అడపా దడపా అవకాశాలతో జీవితాన్ని ముందుకు సాగిస్తుండేది. ఏవో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ ఒక్కసారి జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన తరువాత రష్మీ జీవితం మారిపోయింది. తన అందం, అభినయం, యాంకరింగ్ స్టైల్‌తో ఎంతో మంది అభిమానుల గుండెలను చూరగొన్నది. క్యూట్ క్యూట్ గా రష్మీ మాట్లాడే తెలుగుకు చాలా మంది నవ్వుకుంటారు. జబర్దస్త్ ఇంట్రోలొ రష్మీ చేసే డ్యాన్స్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కూడా. ఈ షోలో భాగమైన ఫేమస్ కమెడియన్, హీరో సుడిగాలి సుధీర్‌తో చేసే రొమాన్స్ వల్ల ఇంకా ఎక్కువ పాపులర్ అయింది రష్మీ. వీళ్ళ జోడికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానులు ఖుషీ అవుతారు. వీళ్ళిద్దరూ కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేస్తే ఇక లైకుల తుఫాన్, కామెంట్ల వర్షమే కురుస్తుంది.
కేవలం టీవీలలోనే కాకుండా రష్మీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో ఈ అమ్మడికి 4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తరచూ ఫొటో షూట్లు, ఇంస్టా రీల్స్ అంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ట్రెడిషనల్, మోడ్రెన్ డ్రెస్సుల్లో రష్మీ చేసే ఫొటో షూట్లు వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే ఏదైనా ఈవెంట్ జరిగిన రష్మీ చేసి రీల్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో రష్మీ తాజాగా పోస్ట్ చేసిన ఓ రీల్ అభిమానుల గుండెలు కొల్లగొడుతోంది. ఈటీవీ నిర్వహించిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న రష్మీ అక్కడ ఈ రీల్ చేసింది. హాఫ్ సారీలో పల్లెటూరి వాతావరణంలో రష్మీ చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంటుంది. ముద్దు ముద్దుగా నవ్వుతూ అలా నడుచుకుంటూ వస్తున్న రష్మిని చూస్తూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి