• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 3 మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.

    థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు

    ఖుషి

    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 1న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం అందించారు. 

    నా… నీ ప్రేమకథ

    ఆముద శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నా… నీ ప్రేమకథ’. కారుణ్య చౌదరి కథానాయిక. శ్రవణ్‌కుమార్‌ నిర్మాత. ఈ సినిమా సెప్టెంబరు 2న (శనివారం) థియేటర్‌లో విడుదల కానుంది. ‘ఒక ఊరిలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి’ అని చిత్ర బృందం చెబుతోంది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌, ట్రైలర్‌, ప్రచార చిత్రాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. 

    ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

    డీడీ రిట‌ర్న్స్

    తమిళ కమెడియన్‌ సంతానం హీరోగా న‌టించిన డీడీ రిట‌ర్న్స్ (DD Returns) మూవీ ఈ వారం ఓటీటీలోకి రానుంది. సెప్టెంబ‌ర్ 1న‌ (శుక్రవారం) జీ5 (Zee 5) వేదికగా ఈ హార‌ర్ కామెడీ మూవీ రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. 2016లొ వచ్చిన ‘దిల్లుకు దుడ్డు’ సినిమాకు సీక్వెల్‌గా ‘డీడీ రిట‌ర్న్స్‌’ రూపొందింది. ప్రేమ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా జూలై 28న థియేట‌ర్ల‌లో రిలీజైంది. రూ.5 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన మూవీ రూ.40 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి పెద్ద హిట్‌గా నిలిచింది. సినిమాలో సుర‌భి హీరోయిన్‌గా చేసింది. 

    TitleCategoryLanguagePlatformRelease Date

    The Wheel of Time; season 2
    SeriesEnglishAmazon PrimeSep 01
    Scam 2023SeriesHindi/TeluguSonyLIVSep 01
    DD ReturnsMovieTelugu/TamilZee 5Sep 01
    AloneReality ShowEnglishNetflixAug 30
    Choose LoveMovieHindiNetflixAug 31
    One PieceSeriesEnglishNetflixAug 31
    Friday Night PlanMovieHindiNetflixSep 01
    Happy EndingMovieEnglishNetflixSep 01
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv