గతవారం లాగే ఈ వీక్ కూడా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించి ఆనందంలో ముంచెత్తనున్నాయి. తద్వారా వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
సి 202 (C 202)
మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘సి 202’. గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటించారు. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె.ఏ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసింది. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా అందులో ఒక్క డైలాగ్ లేకుండా తమ హావాభావాలతోనే నటీనటులు ఆకట్టుకున్నారు. అక్టోబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.
పొట్టేల్ (Pottel)
అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర కృష్ణ (Yuva Chandra Krishna) జంటగా చేసిన చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకుడు. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 25న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.
నరుడి బ్రతుకు నటన (Narudi Brathuku Natana)
శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో ‘నరుడి బ్రతుకు నటన’ రూపొందింది. శ్రుతిజయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ ప్రధాన పాత్రలు పోషించారు. టి.జి.విశ్వప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, డా.సింధురెడ్డి నిర్మాతలు. అక్టోబరు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
లగ్గం (Laggam)
సాయిరోనక్, ప్రగ్యా నగ్రా జంటగా చేసిన చిత్రం ‘లగ్గం’. ఈ చిత్రానికి రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించారు. వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రోహిణి, సప్తగిరి, కృష్ణుడు, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ అక్టోబరు 25న విడుదల కానుంది. ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
రోటి కపడా రొమాన్స్ (Roti Kapda Romance)
సందీప్ సరోజ్, తరుణ్, హర్షా నర్రా, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్‌లుగా చేసిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి సృజన్ కుమార్ బొజ్జం ఈ సినిమాను నిర్మించారు. అక్టోబరు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ (Venom The Last Dance)
ఈ వారం హాలీవుడ్‌లో సూపర్ హీరో చిత్రం రాబోతోంది. బ్లాక్‌బాస్టర్ మూవీ సిరీస్ ‘వెనమ్’కు కొనసాగింపుగా పార్ట్ 3 రాబోతోంది. ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ పేరుతో అక్టోబర్ 24న ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. 3డి వెర్షన్‌లోనూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కెల్లీ మార్సెల్ దర్శకుడు. ఈ సిరీస్‌లో ఇదే తన చివరి చిత్రమని కథానాయకుడు టామ్ హార్డీ ఇప్పటికే ప్రకటించాడు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు
Title | Category | Language | Platform | Release Date |
Family Pack | Movie | English | Netflix | Oct 23 |
The Comeback 2004 Boster Red Sacks | Series | English | Netflix | Oct 23 |
Beauty In Black | Series | English | Netflix | Oct 24 |
Territory | Series | English | Netflix | Oct 24 |
Do Patti | Movie | Hindi | Netflix | Oct 25 |
Don’t Move | Movie | English | Netflix | Oct 25 |
Hell Bound 2 | Movie | English/Korean | Netflix | Oct 25 |
Satyam Sundaram | Movie | Telugu/Tamil | Netflix | Oct 25 |
Nautilus | Series | English | Amazon | Oct 25 |
Jigawatt | Movie | Hindi | Amazon | Oct 25 |
Vettaiyan | Movie | Telugu/Tamil | Amazon | Nov 7 |
The Bike Riders | Movie | English | Jio Cinema | Oct 21 |
Furiosa: A Mad Max Saga | Movie | Telugu Dub | Jio Cinema | Oct 23 |
The Miranda Brothers | Movie | Hindi | Jio Cinema | Oct 25 |
The Legend Of Hanuman 5 | Series | Telugu Dub | Hotstar | Oct 25 |
Aindham Vedham | Movie | Tamil | Zee 5 | Oct 25 |
A Zindagi | Movie | Hindi | Zee 5 | Oct 25 |
Maa Nanna Superhero | Movie | Telugu | Zee 5 | Oct 31 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!