శాంసంగ్ తన తాజా స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ A16 5Gని శుక్రవారం(అక్టోబర్ 18) రోజున భారతదేశంలో విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకంగా ఆరు OS అప్‌డేట్‌లు మరియు ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ మద్దతును అందిస్తుంది
ఈ గెలాక్సీ A16 5G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ IP54 డస్ట్ & వాటర్ రెసిస్టెంట్ సర్టిఫికేట్ కలిగి ఉండటం ప్రత్యేకత. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8GB RAM, 256GB వరకు అంతర్గత స్టోరేజ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
ఫీచర్లు:
శాంసంగ్ గెలాక్సీ A16 5G లోని ముఖ్యమైన ఫీచర్లు ఇలా ఉన్నాయి:
- 6.7 అంగుళాల ఫుల్-HD+ అమోలెడ్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్.
- మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్.
- 8GB RAM, 256GB వరకు స్టోరేజ్, 1TB వరకు మైక్రో SD కార్డ్ సపోర్ట్.
- ఆరు OS అప్‌గ్రేడ్‌లు మరియు ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు.
కెమెరా ఫీచర్లు:
ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది:
- 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా.
- 5-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్.
- 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్. ముందు భాగంలో 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది.
బిల్డ్ – సెక్యూరిటీ:
గెలాక్సీ A16 5G మొబైల్ ఫోన్ 7.9mm మందం, IP54 సర్టిఫికేషన్ కలిగి ఉంది, సురక్షితమైన వినియోగం కోసం Samsung Knox Vault సెక్యూరిటీ ఫీచర్ కూడా అందించబడింది.
బ్యాటరీ & చార్జింగ్:
ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్క ఛార్జ్ పై 2.5 రోజుల ప్లేబ్యాక్ సమయం కల్పించగలదని శాంసంగ్ క్లెయిమ్ చేసింది. అదనంగా, NFC ఆధారిత ట్యాప్ అండ్ పే ఫీచర్‌తో Samsung Wallet కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది.
ధర
భారత్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 18,999, మరియు 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 20,999 గా ఉంది. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్, గోల్డ్ మరియు లైట్ గ్రీన్ రంగులలో అందుబాటులో ఉంది. Samsung.com, Amazon, Flipkart వంటి రిటైల్ ప్లాట్‌ఫారమ్‌లలో అమ్మకానికి ఉంటుంది.
ఆఫర్లు
Axis మరియు SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు రూ. 1,000 డిస్కౌంట్ పొందవచ్చు.
యూరోప్ మార్కెట్లో ఈ ఫోన్ EUR 249 (సుమారు రూ. 23,000) ధరకే సింగిల్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం అందుబాటులో ఉంది. గ్రే, మిడ్‌నైట్ బ్లూ, టర్కాయిస్ రంగుల్లో అట్రాక్ట్ చేస్తోంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్