• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bagheera Trailer Review: ప్రశాంత్‌ నీల్‌ ‘భగీరా’ట్రైలర్‌లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్‌ కానుందా?

    ప్రశాంత్‌ నీల్‌ ‘భగీరా’ట్రైలర్‌లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్‌ కానుందా?కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్‌’ (KGF), ‘కేజీఎఫ్‌ 2’ (KGF 2) దేశవ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. కేజీఎఫ్‌ ముందు వరకూ పెద్దగా ఎవరికి తెలియని కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ఆ రెండు చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఇటీవల ప్రభాస్‌తో ‘సలార్‌’ తెరకెక్కించి బాక్సాఫీస్‌ వద్ద మరోమారు వసూళ్ల సునామి సృష్టించాడు. ముఖ్యంగా కథల విషయంలో ప్రశాంత్‌ నీల్‌ ఎంతో శ్రద్ధ వహిస్తారని పేరుంది. ఈ క్రమంలోనే ఆయన ఓ పాన్‌ ఇండియా చిత్రానికి స్టోరీ అందించారు. ‘బఘీర’ పేరుతో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ఇవాళ విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ట్రైలర్‌లో ‘కేజీఎఫ్‌’ మార్క్ కనిపించేలా చాలా అంశాలే ఉన్నాయి. 

    బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌‌లో..

    ‘కేజీఎఫ్’ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌‌కు, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌‌కు పాన్ ఇండియా రేంజ్‌‌లో గుర్తింపు వచ్చింది. వీళ్ల కాంబినేషన్‌లో ఏ ప్రాజెక్ట్‌ రూపొందిన దానిపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్‌ నీల్‌ కథతో హోంబలే ఫిల్మ్స్‌‌ ‘బగీరా’ అనే పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందించింది. ప్రశాంత్‌ నీల్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘ఉగ్రమ్‌’ హీరో శ్రీ మురళి ఇందులో లీడ్‌ రోల్‌ చేశాడు. సూరి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేయగా అది విపరీతంగా ఆకట్టుకుంటోంది. భగీర ట్రైలర్  చూస్తే రెండు డిఫరెంట్ గెటప్స్‌‌లో శ్రీమురళి కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ నీల్ స్టైల్‌‌లోనే యాక్షన్‌‌తో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌‌లోనే ట్రైలర్ విజువల్స్ ఉన్నాయి.

    కేజీఎఫ్‌ తరహా డైలాగ్స్‌!

    ప్రశాంత్‌ నీల్‌ సినిమా అంటే యాక్షన్‌తో పాటు డైలాగ్స్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా కేజీఎఫ్‌ సినిమాలోని డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ‘బగీరా’ ట్రైలర్‌లోనూ ఆ తరహా డైలాగ్స్‌ను మనం చూడవచ్చు. ‘దేవుడు ఎందుకమ్మా రామాయణం, భారతం అంటూ ఎప్పుడో వస్తాడు. ఎందుకు ఎప్పుడూ రాడు’ అని ఓ పిల్లాడు తన తల్లిని అడుగుతున్న డైలాగ్‌తో ట్రైలర్ మెుదలవుతుంది. ‘మనిషి మృగంగా మారినప్పుడు వస్తాడు’ అంటూ అందుకు తగ్గ పరిస్థితులను ఆ తల్లి వివరిస్తుంది. ఆ డైలాగ్‌ చెప్తున్న క్రమంలోనే క్రూరమైన విలన్స్‌తో కూడిన సన్నివేశాలను చూపించారు. పోలీస్ ఆఫీసర్ అయిన హీరో తన యూనిఫామ్‌ను పక్కనపెట్టి ఓ ముసుగు మనిషిలా క్రిమినల్స్‌ను పాశవికంగా చంపడం చూపించారు. ఓ వైపు పోలీస్‌గా మరోవైపు రాక్షసులను చంపే వెపన్ గా మారె శ్రీ మురళి యాక్టింగ్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. పోలీసు ఉన్నతాధికారిగా నటుడు ప్రకాష్‌ రాజ్‌ ట్రైలర్‌లో కనిపించాడు. 

    తల్లి సెంటిమెంట్‌!

    కేజీఎఫ్‌ సినిమాను గమనిస్తే చిన్నప్పుడే హీరో తల్లి చనిపోతుంది. చివరి క్షణాల్లో తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో క్రిమినల్‌గా మారతాడు. బగీరా ట్రైలర్‌ను గమనిస్తే కేజీఎఫ్‌కు సిమిలార్‌ స్టోరీతో ఇది వస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇందులోనూ తల్లి సెంటిమెంట్‌ ఉండనున్నట్లు ట్రైలర్‌ను బట్టే తెలిసిపోతోంది. చిన్నప్పుడు తల్లి చనిపోయిన ఓ పిల్లాడు అన్యాయాలను ఎదిరించేందుకు పెద్దయ్యాక పోలీసు అవుతాడు. చట్టబద్దంగా న్యాయం జరగట్లేదని భావించి ముసుగు వ్యక్తిలా మారతాడు. అలా బగీరా గెటప్‌లో క్రిమినల్స్‌ను చాలా దారుణంగా చంపుతాడు. అయితే హీరో తల్లికి క్రిమినల్స్‌ నుంచి ఇబ్బందులు ఎదురై ఉండవచ్చు. దీంతో ఆమెకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదన్న ఉద్దేశ్యంతో హీరో ఖాకీ ధరించి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ చూస్తుంటే అచ్చం కేజీఎఫ్‌ను చూసిన ఫీలింగ్ కలుగుతోందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

    ‘NTR 31’తో బిజీ బిజీ

    సలార్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత ప్రశాంత్ నీల్‌ తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ను జూ.ఎన్టీఆర్‌ (Jr NTR)తో చేయబోతున్నాడు. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా బంగ్లాదేశ్‌ నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో తారక్‌ బంగ్లాదేశ్‌ రైతుగా కనిపిస్తారని స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్‌ వర్మ ‘NTR 31’ ప్రాజెక్ట్‌ను సింగిల్‌ పార్ట్‌గా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్‌తో ‘సలార్‌ 2’ ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించే అవకాశముంది. అలాగే రామ్‌ చరణ్‌తోనే ఓ ప్రాజెక్ట్‌ను ఫైనల్‌ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv