• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Zebra Movie Review: ఈసారైనా సత్యదేవ్‌ హిట్‌ కొట్టాడా? ‘జిబ్రా’ ఎలా ఉందంటే?

    నటీనటులు : సత్యదేవ్, డాలీ ధనంజయ్, ప్రియా భవానీ శంకర్‌, అమృత అయ్యంగార్‌, జెన్నీఫర్‌, సునీల్‌, సత్య, సత్యరాజ్‌, సురేష్‌ చంద్ర మీనన్‌ తదితరులు

    దర్శకత్వం : ఈశ్వర్‌ కార్తిక్‌

    సంగీతం : రవి బస్రూర్‌

    సినిమాటోగ్రఫీ: సత్య పొన్మార్‌

    ఎడిటింగ్‌: అనిల్ క్రిష్‌

    నిర్మాతలు: ఎస్‌.ఎన్‌. రెడ్డి, బాల సుందరం, దినేష్‌ సుందరం

    విడుదల తేదీ: నవంబర్‌ 22, 2024

    సత్యదేవ్ (Satya Dev), డాలి ధనంజయ్ (Daali Dhananjaya) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra Movie Review). ‘పెంగ్విన్‌’ సినిమాను డైరెక్ట్‌ చేసిన ఈశ్వర్‌ కార్తీక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్‌, అమృత అయ్యంగార్‌ కథానాయికలుగా చేశారు. వైట్ కాలర్‌ క్రైమ్‌ డ్రామాలో దీనిని రూపొందించారు. మెగాస్టార్‌ చిరు (Chiranjeevi) ఈ మూవీ ప్రమోషన్స్‌లో స్వయంగా పాల్గొనడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న సత్యదేవ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    మిడిల్‌ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్‌) బ్యాంక్‌ ఆఫ్‌ ట్రస్ట్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్‌)ని ఇష్టపడతాడు. ఓ రోజు స్వాతి తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్‌ చేస్తుంది. సదరు వ్యక్తిని సంప్రదించగా డబ్బు వాడేసుకున్నట్లు చెబుతాడు. దీంతో ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడేందుకు సూర్య రంగంలోకి దిగుతాడు. సమస్యను పరిష్కరించే క్రమంలో అనుకోకుండా రూ.5 కోట్ల బ్యాంక్‌ ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో రాష్ట్రంలోనే ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్‌)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? సూర్య లైఫ్‌లోకి ఆది ఎలా వచ్చాడు? రూ.5 కోట్ల ఫ్రాడ్‌ కేసు సూర్యను ఇంకెంత పెద్ద సమస్యలోకి నెట్టివేసింది? ఈ సమస్యల నుంచి చివరికీ బయటపడ్డాడా? లేదా? అన్నది స్టోరీ (Zebra Movie Review).

    ఎవరెలా చేశారంటే

    సూర్య పాత్రలో నటుడు సత్యదేవ్‌ (Satyadev) మరోమారు దుమ్ములేపాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌, ఎమోషన్స్‌ ఇలా అన్ని కలగలిసిన పాత్రలో సత్యదేవ్‌ అదరగొట్టాడు. సత్యదేవ్‌ తర్వాత ఆ స్థాయిలో మెప్పించాడు కన్నడ నటుడు డాలి ధనంజయ్‌. ఆది పాత్రలో అతడు జీవించేశాడు. సినిమాలో అత్యంత పవర్‌ఫుల్‌ పాత్ర అతడిదే. కొన్ని సన్నివేశాల్లో సత్యదేవ్‌ను డామినేట్ చేశాడన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ప్రియా భవానీ శంకర్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కింది. జెన్నిఫర్‌ తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. సత్య కామెడీ టైమింగ్ మరోమారు ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. సినిమా మెుత్తం సూర్య వర్సెస్‌ ఆది అన్నట్లు సాగిపోవడంతో మిగిలిన పాత్రలు పెద్దగా హైలెట్‌ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ బ్యాంకింగ్‌ రిలేటెడ్‌ కంటెంట్‌ (Zebra Movie Review)ను తీసుకొని ఎగ్జిక్యూట్‌ చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే విషయంలో అతడి నైపుణ్యం బాగా కనిపిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఫ్రాడ్స్‌ను కళ్లకు కట్టే ప్రయత్నంలో కొంతమేర దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కెరీర్‌ ప్రారంభంలో బ్యాంక్‌ ఎంప్లాయిగా ఈశ్వర్‌ కార్తిక్‌ పని చేయడం సినిమాకు కలిసివచ్చింది. అయితే సాధారణ బ్యాంక్‌ ఎంప్లాయి అయిన హీరో నాలుగు రోజుల్లో రూ.5 కోట్లను సంపాదించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. రూ.100 కోట్ల సమస్యను సైతం ఒక్క ఈమెయిల్‌తో తప్పించుకోవడం కూడా లాజిక్‌కు అందదు. లాజిక్కులను పట్టించుకోని ప్రేక్షకులకు మాత్రం జిబ్రా కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు. సత్యదేవ్‌ – డాలీ మధ్య జరిగే ఇంట్రస్టింగ్‌ వార్‌, సత్య కామెడీ, సునీల్‌ నటన, డైలాగ్స్‌ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.

    సాంకేతికంగా

    టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Zebra Movie Review) రవి బస్రూర్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ మరో లెవల్‌కు తీసుకెళ్లింది. పాటలు మాత్రం గుర్తుంచుకునేలా లేవు. సత్య పోన్మార్ కెమెరా వర్క్‌ బాగుంది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. బ్యాంక్‌ను పర్ఫెక్ట్‌గా రీక్రియేట్‌ చేసి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ మంచి మార్కులు కొట్టేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్స్

    • కథ, స్క్రీన్‌ప్లే
    • సత్యదేవ్‌, ధనంజయ్‌ నటన
    • నేపథ్య సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • లాజిక్‌కు అందని సన్నివేశాలు
    • ఇరికించినట్లు వచ్చే పాటలు

    Telugu.yousay.tv Rating : 2.5/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv