వివాహం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మహత్తరమైన సందర్భం. ఈ ప్రత్యేక సందర్భంలో ఇచ్చే బహుమతులు కేవలం వస్తువులు మాత్రమే కాదు, అవి వారిపై మనకున్న ప్రేమ, శ్రద్ధ, ఆశీర్వాదాలను వ్యక్తం చేస్తాయి. సరైన గిఫ్ట్‌తో ఆ జంట జీవితంలో శుభం, సౌఖ్యం, ఆనందం కలగాలని మన అభిలాషను తెలియజేస్తుంది. అలా ఈ బహుమతులు వారి జీవితంలో చిరస్మరణీయంగా నిలుస్తాయి. మరి ఆ ప్రత్యేక సందర్భంలో ఎలాంటి బహుమతులు ఇస్తే బాగుంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
వాల్ ఆర్ట్ (Wall Art)
కొత్తగా పెళ్లైన దంపతులు తమ ఇంటిని అందంగా అలంకరించుకునేందుకు వాల్ ఆర్ట్ చాలా సరైన గిఫ్ట్. ఇది వారుంటున్న ఇంటిలో కళాత్మకతను పెంచుతుంది. అమెజాన్‌లో రూ. 1,000 నుంచి 2,000 లో మంచి వాల్ ఆర్ట్ లభిస్తాయి. ఒక మంచి వాల్ ఆర్ట్ కొత్త దంపతుల జీవితంలో నూతన ఆలోచనలను, సృజనాత్మకతను చేకూరుస్తుందని చెప్పవచ్చు.
పట్టు బట్టలు
నూతన వధువరులకు కొత్త బట్టలు బహుకరించడం సాంప్రదాయం. ముఖ్యంగా పట్టు బట్టలను ఇద్దరికి గిఫ్ట్‌గా ఇవ్వడం మంచి ఆలోచన. కొత్త జంటలకు సరిపోయే కాంబోలు అమెజాన్‌లో చాలానే ఉన్నాయి.
డైనింగ్ సెట్
కిచెన్‌లో వంట అవసరాలను తీర్చడానికి డైనింగ్ సెట్లు మంచి ఆలోచన. మంచి నాణ్యత కలిగిన, తక్కువ ప్రైస్‌లో డైనింగ్ సెట్లు రూ. 1,500 లోపు అందుబాటులో ఉంటాయి. కొత్త జీవితం ప్రారంభించే వారికి ఇది కచ్చితంగా మంచి గిఫ్ట్ అవుతుంది.
అదృష్ట తాబేలు
కొత్త జంట తమ జీవితాన్ని సంతోషంగా ముందుకు నడపాలని పెద్దలు కోరుకుంటుంటారు. వారు సిరి సంపదలతో తూగాలని ఆశిస్తుంటారు. అదృష్టానికి ప్రతీకగా భావించే తాబేలు బొమ్మను బహుకరించవచ్చు.
ఆరోమా డిఫ్యూజర్ (Aroma Diffuser & Essential Oils)
కొత్తగా పెళ్లైన వారికి వారి ఉండే చోట మంచి వాతావరణాన్ని కల్పించడానికి ఆరోమా డిఫ్యూజర్ గొప్ప గిఫ్ట్ అవుతుంది. ఆరోమా థెరపీ నూతన వధువరుల్లో రొమాంటిక్ ఆలోచనలను రేకెత్తిస్తుంది. అమెజాన్‌లో రూ. 1,500 నుండి మంచి క్వాలిటీ డిఫ్యూజర్స్ లభిస్తాయి. దీని సువాసనలు దంపతుల మనసు ప్రశాంతంగా, శాంతియుతంగా ఉంచుతుందని చెప్పవచ్చు.
కాఫీ మేకర్ (Coffee Maker)
కాఫీ ప్రేమికులైన కొత్త దంపతులకు కాఫీ మేకర్ మంచి బహుమతి అవుతుంది. వారి రోజులు కొత్త ఉత్సాహంతో ప్రారంభం కావడానికి ఈ గిఫ్ట్ బాగా ఉపయోగపడుతుంది. అమెజాన్‌లో రూ. 1,800 లోపు బేసిక్ కాఫీ మేకర్స్ లభిస్తాయి. ఇది వారి బంధంలో మధుర స్మృతులను జోడించగలదు.
ఫోటో ఫ్రేమ్స్ (Photo Frames)
పెళ్లి అనంతరం, మధుర క్షణాలను గుర్తుగా పెట్టుకోవడానికి ఫోటో ఫ్రేమ్స్ బహుమతిగా ఇవ్వడం మంచి ఆలోచన. అమెజాన్‌లో వివిధ ఆకారాల్లో, డిజైన్లలో ఫోటో ఫ్రేమ్స్ రూ. 500 నుంచి 2,000 లోపు లభిస్తాయి. దీన్ని కొత్త జంట తమ ప్రత్యేక క్షణాలను నిక్షిప్తం చేయడానికి ఉపయోగపడుతాయి.
బెడ్ షీట్ & బ్లాంకెట్స్ (Bedsheets and Blankets)
మంచి నాణ్యమైన బెడ్ షీట్ లేదా కంబళ్లు కొత్త దంపతులకు చాలా ఉపయోగకరమైన బహుమతులు. అమెజాన్‌లో ఈ రకాలు రూ. 1,000 నుంచి 2,000 మధ్య లభిస్తాయి.
కుక్‌వేర్ సెట్లు (Cookware Sets)
కిచెన్‌లో వంట అవసరాలను తీర్చడానికి కుక్‌వేర్ సెట్లు మంచి ఆలోచన. మంచి నాణ్యత కలిగిన, మినిమల్ ప్రైస్‌లో కుక్‌వేర్ సెట్లు రూ. 1,500 లోపు అందుబాటులో ఉంటాయి. కొత్త జీవితం ప్రారంభానికి ఇది మంచి గిఫ్ట్ అవుతుంది.
పెర్ఫ్యూమ్స్ (Perfumes)
పెర్ఫ్యూమ్‌లు కొత్త దంపతులకు గొప్ప బహుమతిగా భావించవచ్చు. ప్రత్యేక సందర్భాలలో ఉపయోగపడుతుంది. ఇది కొత్త దంపతుల మధ్య రొమాంటిక్ మూడ్‌ను రెకెత్తిస్తుందని చెప్పవచ్చు. అమెజాన్‌లో రూ. 1,000 నుండి రూ. 2,000 ధరలో మంచి సువాసన కలిగిన పెర్ఫ్యూమ్స్ లభిస్తాయి.
లవ్ హ్యాండ్స్
కొత్తగా పెళ్లైన నవదంపతులను థ్రిల్ చేసేందుకు లవ్ హ్యాండ్స్ అనేది మంచి ఐడియా అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ గిఫ్ట్ ట్రెండింగ్‌లో ఉంది. వినూత్నంగా గిఫ్ట్ ఇవ్వాలనుకునే వారికి ఇది ఒక మంచి ఛాయిస్. ఈ గిఫ్ట్‌పై వధువరులిద్దరి పేర్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి గిఫ్ట్‌లు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
గ్రీన్ ప్లాంట్స్ (Indoor Plants)
ఇంటి వాతావరణాన్ని తేజోవంతం చేయడానికి గ్రీన్ ప్లాంట్స్ చాలా మంచి ఆలోచన. ఇది శుభకార్యాలలో ఇచ్చే మంచి బహుమతి. అమెజాన్‌లో రూ. 500 నుండి 2,000 లో వివిధ రకాల ఇంట్లో పెంచగల మొక్కలు లభిస్తాయి. ఈ ప్లాంట్స్ కొత్త జీవితం, కొత్త ఉత్సాహాన్ని సూచిస్తాయి.
వాచ్‌లు (Watches)
కష్టసమయంలో సమయం ఎంత ముఖ్యమో తెలియజేసే వాచ్ ఒక అద్భుతమైన గిఫ్ట్ అవుతుంది. అమెజాన్‌లో మంచి డిజైన్ల వాచ్‌లు రూ. 1,000 నుండి 2,000 వరకు లభిస్తాయి. ఇది కొత్త దంపతుల జీవితంలో సమయాన్ని మెరుగ్గా ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తుంది
టెర్రకోట హ్యాండీ క్రాఫ్ట్స్
టెర్ర కోట హ్యాండీ క్రాఫ్ట్స్‌ను గిఫ్ట్‌గా ఎంచుకోవడం వినూత్నమైన ఆలోచన. మన్నికైన టెర్రకోట బహుమతులు అమెజాన్‌లో అనేకం ఉన్నాయి.
స్కిన్ కేర్ సెట్ (Luxury Skin Care Set)
కొత్త దంపతులకు అందం, ఆరోగ్యం రెండూ ముఖ్యమైనవి. లగ్జరీ స్కిన్ కేర్ సెట్ అందించడం ద్వారా వారు తమ అందాన్ని కాపాడుకోవడానికి సహాయపడవచ్చు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం