ప్రస్తుతం చాలా మంది తమ ఆనందం, సంతోషం, వినోదాన్ని సినిమాల్లోనే వెతుక్కుంటున్నారు. అలా అని ప్రతీసారి థియేటర్లకు వెళ్లి సినిమాను చూడాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. ఈ సమస్య నుంచి బయటపడేందుకే హోమ్ థియేటర్లు (Home Theaters) వచ్చాయి. వీటిని టీవీకి ఫిక్స్ చేసి ఏదైనా సినిమా చూస్తే అచ్చం థియేటర్ అనుభూతి కల్గుతుంది. వాటి క్వాలిటీ సౌండ్ సిస్టమ్, పాటలు అచ్చం థియేటర్ ఉన్న భావనను కల్పిస్తాయి. హోమ్ థియేటర్లో మనకు ఇష్టమైన పాటలు వింటే ఆ మజానే వేరు. కొత్తగా హోమ్ థియేటర్లను కొనాలని భావిస్తున్న వారికి అమెజాన్ బంపరాఫర్లు తీసుకొచ్చింది. గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా టాప్ బ్రాండెడ్ హోమ్ థియేటర్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Zebronics Juke BAR
ఈ హోమ్ థియేటర్ LED స్క్రీన్ కలిగి ఉంది. రిమోట్ ద్వారా దీనిని కంట్రోల్ చేయవచ్చు. 5.1 ఛానెల్ సౌండ్‌బార్‌ను ఇది కలిగి ఉంది. టెలివిజన్‌తో పాటు ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌కు కూడా ఈ హోమ్ థియేటర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.23,999. గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా ఇది 72% డిస్కౌంట్‌తో రూ. 6,797 అందుబాటులోకి వచ్చింది.
GOVO GOSURROUND 945
మీ బడ్జెట్ రూ.5,000 అయితే GOVO GOSURROUND 945 హోమ్ థియేటర్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది డీప్ బేస్ ఉన్న 5.25″ subwooferను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.16,999. అమెజాన్ పండగ సేల్‌లో దీనిని 71% డిస్కౌంట్‌తో కేవలం రూ.5,000లకే పొందవచ్చు.
Blaupunkt
ఈ హోమ్ థియేటర్ 5.1 సౌండ్‌బార్‌తో వస్తుంది. 20.32 సెం.మీ Subwoofer, రెండు శాటిలైట్ స్పీకర్స్, బ్లూటూట్ & USB కనెక్షన్, రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి. దీని అసలు ధర రూ.19,990 కాగా అమెజాన్ దీనిని సగం ధరకే ఆఫర్ చేస్తోంది. ఫలితంగా ఈ హోమ్ థియేటర్‌ను రూ.8,999 దక్కించుకోవచ్చు.
Sony SA-D40 4.1
సోనీ హోమ్ థియేటర్లో 80W సౌండ్ అవుట్‌పుట్ ఉంది. దీనితో మీరు మంచి స్టీరియో సౌండ్ పొందుతారు. పవర్ఫుల్ బేస్ ఉన్న సబ్‌వూఫర్ కూడా దీనితో పాటు వస్తుంది. ఈ హోమ్ థియేటర్ అమెజాన్‌లో రూ.10,490 లభిస్తోంది.
OBAGE DT-2605
ఈ హోమ్ థియేటర్ క్లీన్ & డీప్ బేస్ ఉన్న రెండు టవర్ స్పీకర్లతో వస్తుంది. ఒక్కో టవర్ స్పీకర్లో ఇన్‌బిల్ట్‌గా ఉన్న మూడు హేవీ బేస్ స్పీకర్లు ఉంటాయి. దీనిని బ్లూటూత్, USB ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.10,000. కానీ అమెజాన్ 20% రాయితీతో రూ.7,999 దీనిని అందిస్తోంది.
JBL Cinema SB271
ఈ స్పీకర్ మీకు సినిమా థియేటర్ అనుభూతిని పంచుతుంది. ఇందులో డాల్బీ డిజిటల్ సౌండ్‌బార్, వైర్లెస్ సబ్‌వూఫర్ ఉంది. దీని అసలు ధర రూ.16,999. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో దీన్ని 41% డిస్కౌంట్‌తో రూ.9,998లకు పొందవచ్చు.
Samsung Dolby
మీరు శాంసంగ్ హోమ్ థియేటర్ కోరుకుంటే ఇది మీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ హోమ్ థియేటర్ Dolby సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. మ్యూజిక్, సినిమాలు, గేమ్స్, న్యూస్ ఇలా మనం చూస్తున్న దానికి అనుగుణంగా ఇది తన సౌండ్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. దీని అసలు ధర రూ.16,990. అమెజాన్ దీనిని రూ.7,498 అందిస్తోంది.
LG Electronics
ఈ హోమ్ థియేటర్.. SPK8-S 2.0 సౌండ్‌బార్, రెండు వైర్లెస్ స్పీకర్ కిట్‌తో వస్తుంది. రూ.19,990 ఉన్న ఈ హోమ్ థియేటర్ ధరను అమెజాన్ భారీగా తగ్గించింది. 55% రాయితీతో రూ.8,989కే ఈ LG హోమ్ థియేటర్‌ను అందిస్తోంది.
boAt AAVANTE
ఇది డాల్బీ సౌండ్ టెక్నాలిజీతో రూపొందింది. 5.1 ఛానెల్ సౌండ్‌బార్, 60W వైర్డ్ సబ్‌వూఫర్, ఈజీ ఆపరేటింగ్ ఫీచర్లను కలిగి ఉంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.24,990. మెగా సేల్‌లో భాగంగా అమెజాన్ దీనిని 60% డిస్కౌంట్‌తో రూ.9,999 ఆఫర్ చేస్తోంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం