• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Camera Mobiles 2023: ప్రొఫెషనల్ కెమెరాలను తలదన్నే స్మార్ట్‌ఫోన్స్‌.. వీటితో మీ ఫొటోలు కిర్రాకే!

    సాధారణంగా ఏదైన కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలంటే ముందుగా అందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూస్తాము. మరి ముఖ్యంగా కెమెరా క్వాలిటీ ఎలా ఉందనే అంశాన్ని పరిశీలిస్తాం. నూటికి 80 శాతం మంది ముందుగా కెమెరా నాణ్యతనే సెర్చ్ చేస్తారు. కాబట్టి కెమెరా ఆధారంగా ఫోన్‌ కొనాలని భావించే వారి కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఇప్పటివరకూ వచ్చిన స్మార్ట్‌ఫోన్స్‌లో అత్యుత్తమైన ఫోన్లను మీ ముందుకు తీసుకొచ్చింది. ఆ మెుబైల్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం. 

    Samsung Galaxy Z Fold 5

    ఈ మెుబైల్‌ అత్యంత నాణ్యమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫోన్‌ వెనుక భాగంలో 50MP + 12MP + 10MP రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీల కోసం 10MP + 4MP డ్యుయల్‌ కెమెరాలను ఫిక్స్‌ చేశారు. అంతేగాక 12GB RAM/ 256GB స్టోరేజ్‌, 4400mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 2 ప్రొసెసర్‌ను Galaxy Z Fold 5 మెుబైల్‌ కలిగి ఉంది. ఈ ఫోన్ రూ.1,64,999 లకు అమెజాన్‌లో సేల్ అవుతోంది. 

     Oppo Reno 10 Pro+ 5G

    ఈ ఒప్పో మెుబైల్‌ కూడా అదిరిపోయే కెమెరా క్వాలిటీతో మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్‌ 50MP + 8MP + 64MP రియర్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 32MP కెమెరాను అమర్చారు. వీటి సాయంతో అత్యంత నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని ఒప్పో పేర్కొంది. Reno 10 Pro+ మెుబైల్‌ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. 6.70 అంగుళాల 1080×2412 రిజల్యూషన్‌ స్క్రీన్‌ను ఫోన్‌కు అందించారు. Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రొసెసర్‌తో ఇది వర్క్ చేస్తుంది. 12GB RAM / 256GB స్టోరేజ్, 4700mAh బ్యాటరీని ఫోన్‌ కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.54,999కు సేల్ అవుతోంది.

    Google Pixel 7a

    గూగుల్‌ తీసుకొచ్చిన  ‘Google Pixel 7a’ టెక్‌ ప్రియులను ఫిదా చేసింది. ముఖ్యంగా ఇందులోని 64MP + 12MP రియర్‌ కెమెరా సెటప్‌ యూజర్లను ఆకట్టుకుంది. ఈ ఫోన్‌కు ఫ్రంట్‌ వైపు 10.8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. అలాగే 6.10 అంగుళాల స్క్రీన్‌,  Google Tensor G2 ప్రొసెసర్‌, 8GB RAM / 128GB ROM వంటి ఫీచర్లను ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.35,999 సేల్ అవుతోంది. 

    OnePlus 11 5G

    ఈ వన్‌ప్లస్‌ ఫోన్‌ 50MP + 48MP + 32MP రియర్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే 16MP కెమెరాను ఫోన్‌ ముందు వైపు అమర్చారు. వీటి సాయంతో అద్బుతమైన ఫొటోలను క్యాప్చర్‌ చేయవచ్చు. ఇక ఈ OnePlus 11 5G మెుబైల్‌.. 6.70 అంగుళాల స్క్రీన్‌, Snapdragon 8 Gen 2 ప్రొసెసర్‌, 12GB RAM / 256GB ROM, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌ రూ.56,999కు సేల్ అవుతోంది. 

    Redmi Note 12 Pro+ 5G

    రెడ్‌మీ నుంచి క్వాలిటీ కెమెరా ఫోన్‌ కోరుకునే వారు Note 12 Pro + 5G ట్రై చేయవచ్చు. ఈ ఫోన్‌ వెనుక వైపు ఏకంగా 200MP + 8MP + 2MP రియర్‌ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఫోన్ 6.67 అంగుళాల స్క్రీన్‌, MediaTek ప్రొసెసర్‌, 12GB RAM/ 256GB ROM, 4980mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ.29,500.

    Xiaomi 13 Pro

    ఈ చైనా మెుబైల్‌ 50MP + 50MP + 50MP రియర్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.  ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాతో ఇది వస్తుంది. 6.70 అంగుళాల స్క్రీన్‌, 3200×1440 పిక్సెల్స్ రిజల్యూషన్‌, Snapdragon 8 Gen 2 ప్రొసెసర్‌, 12GB RAM / 256GB స్టోరేజ్‌,  4820mAh బ్యాటరీ అదనపు ఫీచర్లుగా ఇందులో ఉన్నాయి. అమెజాన్‌లో ఈ ఫోన్ రూ.74,998కు సేల్ అవుతోంది.

    Infinix Zero 30 5G

    ఇన్‌ఫినిక్స్‌ నుంచి Infinix Zero 30 5G మెుబైల్‌ మంచి కెమెరా క్వాలిటీతో విడుదలైంది. ఈ ఫోన్‌ వెనుక భాగంలో 108MP + 13MP డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. 50MP సెల్ఫీ కెమెరాను ఫోన్‌కు అందించారు. MediaTek Dimensity 8020 ప్రొసెసర్‌, 6.78 అంగుళాల స్క్రీన్‌, 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. అమెజాన్‌లో ఈ ఫోన్ 26,999 సేల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv