ఐఫోన్‌కు సమానంగా గూగుల్ (Google) ఫోన్లకు మార్కెట్‌లో మంచి గుడ్‌విల్ ఉంది. గూగుల్ గత నెలలో Google Pixel 8 సిరీస్‌ను రిలీజ్ చేసింది. తాజాగా Google Pixel 8 Pro మోడల్‌ను గూగుల్ కొత్తగా భారత్‌లో లాంచ్ చేసింది. 8 సిరీస్ టెక్ ప్రియుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో కొత్త వేరియంట్‌పై అందరి దృష్టి పడింది. ఈ మెుబైల్‌ను అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో తీసుకొచ్చినట్లు గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులోని స్టన్నింగ్ ఫీచర్లు మెుబైల్ ప్రియులను తప్పక ఆకర్షిస్తాయని గూగుల్ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో Google Pixel 8 Pro ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఫోన్ స్క్రీన్
ఈ మెుబైల్ 6.7 అంగుళాల HDR10+ LTPO OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1344×2992 పిక్సెల్స్ రిజల్యూషన్, Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్‌ను డిస్‌ప్లేకు అందించారు. Android 14 OS, Google Tensor G3 చిప్‌సెట్‌తో ఈ మెుబైల్ వర్క్ చేస్తుంది.
ర్యామ్ & స్టోరేజ్
ఈ మెుబైల్ రెండు వేరియంట్లను కలిగి ఉంది. 12GB RAM / 128GB ROM, 12GB RAM / 256GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ర్యామ్, స్టోరేజ్ అవసరాన్ని బట్టి నచ్చిన వేరియంట్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.
బిగ్ బ్యాటరీ
Google Pixel 8 Pro స్మార్ట్‌ఫోన్‌కు పవర్‌ఫుల్ బ్యాటరీని ఫిక్స్ చేశారు. 5050mAh బ్యాటరీని అందించారు. ఇది 30W వైర్డ్, 23W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 30 నిమిషాల్లోనే 50% మేర మెుబైల్‌ను ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
కెమెరా నాణ్యత
ఈ గూగుల్ మెుబైల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రూపొందింది. 50 MP ప్రైమరీ కెమెరా + 48 MP టెలిఫొటో సెన్సార్ + 48 MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను అమర్చారు. వీటి సాయంతో నాణ్యమైన ఫొటోలు, 4K వీడియోస్ తీసుకోవచ్చు. ముందు వైపు 10.5 MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఇది కూడా 4K వీడియోకు సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ మెుబైల్‌లో Wi-Fi 802.11, Bluetooth 5.3, GPS (L1+L5), అండర్ డిస్‌ప్లే Fingerprint సెన్సార్, యాక్సిలోమీటర్ (accelerometer), గైరో (gyro),ప్రాక్సిమిటీ (proximity) సెన్సార్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే బారో మీటర్, స్కిన్ టెంపరేచర్‌ను పసిగట్టే థర్మోమీటర్ ఫీచర్లను ఫోన్ కలిగి ఉంది.
కలర్ ఆప్షన్స్
గూగుల్ పిక్సెల్ 8 ప్రో మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. బే, ఒబ్సిడియాన్, పోర్సెలియాన్ కలర్స్‌లో గూగుల్ ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. మీకు నచ్చిన రంగును ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
ధర ఎంతంటే?
Google Pixel 8 Pro మెుబైల్ ధరను వేరియంట్‌ను బట్టి గూగుల్ నిర్ణయించింది. 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన మెుబైల్ ధరను రూ.1,06,999గా గూగుల్ ప్రకటించింది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌ను రూ.1,13,999లకు గూగుల్ విక్రయిస్తోంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం