భారత్‌లో మంచి క్రేజ్ ఉన్న చైనీస్ మెుబైల్ కంపెనీల్లో రెడ్మీ (Redmi) ఒకటి. ఈ సంస్థ ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ టెక్ ప్రియులను ఆకర్షిస్తుంది. ఈ క్రమంలోనే రెడ్మీ కొత్త మెుబైల్ ‘Redmi Note 13R Pro’ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ మెుబైల్‌కు సంబంధించిన సమాచారం ఆన్లైన్లో లీకయ్యింది. చైనాకు చెందిన పలు టెలికాం వెబ్సైట్లు ఈ ఫోన్ వివరాలను కొంతవరకూ రివీల్ చేశాయి. దీంతో నయా రెడ్మీ మెుబైల్ ఫీచర్లు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై ఓ లుక్కేద్దాం.
ఫోన్ స్క్రీన్
Redmi Note 13R Pro మెుబైల్.. 6.67 అంగుళాల డిస్ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. MediaTek Dimensity 810 SoC ప్రొసెసర్, Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్ రన్ అవుతుందని తెలిసింది. Redmi Note 12R Pro స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానంగా ఈ ఫోన్ రాబోతోంది.
స్టోరేజ్ సామర్థ్యం
లీకైన సమాచారాన్ని బట్టి నయా రెడ్మీ ఫోన్‌ను భారీ RAMతో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 12GB RAMతో ఈ ఫోన్ వర్క్ చేస్తుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ గరిష్ట ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం 256GB ఉండనున్నట్లు తెలిసింది.
కెమెరా క్వాలిటీ
రెడ్మీ నోట్ 13ఆర్ ప్రో ఫోన్.. అద్భుతమైన కెమెరా సెటప్‌తో లాంచ్ కానుంది. ట్రిపుల్ రియర్ కెమెరాలతో రెడ్మీ ఈ ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. 108MP ప్రైమరీ కెమెరా + 2MP సెంకడరీ సెన్సార్ ఫోన్ వెనక భాగంలో ఉండనున్నాయి. ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది.
అడ్వాన్స్డ్ సెన్సార్లు
ఈ మెుబైల్‌ను పలు కీలకమైన సెన్సార్లతో రెడ్మీ తీసుకొస్తోంది. ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో పాటుగా ఆన్‌బోర్డ్ సెన్సార్, లైట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, డిస్టెన్స్ సెన్సార్లు మెుబైల్లో ఉండనున్నాయి. అలాగే NFC, USB Type-C port, GPS కనెక్టివిటీ ఫీచర్లతో ఫోన్ రానుంది.
ధర ఎంతంటే?
Redmi Note 13R Pro మెుబైల్ ధరను కూడా పలు టెలికాం వెబ్సైట్లు ముందుగానే అంచనా వేస్తున్నాయి. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,000 వరకూ ఉండొచ్చని అభిప్రాయపడ్డాయి. దీనిపై రెడ్మీ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఫోన్ భారత్‌లో అడుగుపెట్టే అవకాశముంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం