ప్రముఖ చైనీస్ మెుబైల్ తయారీ సంస్థ ఒప్పో సరికొత్త ఫోన్‌తో రాబోతోంది. ‘Oppo Reno 11’ సిరీస్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తొంది. నవంబర్ 23న Pad Air 2తో పాటు ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేయనుంది. అయితే ఈ మెుబైల్‌కు సంబంధించిన ఫీచర్లు ముందుగానే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
వేరియంట్స్
ఈ నయా ఒప్పో మెుబైల్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఒప్పో రెనో 11 (Oppo Reno 11), ఒప్పో రెనో 11 ప్రో (Oppo Reno 11 Pro) పేర్లతో రెండు ఫోన్లను లాంచ్ చేయనున్నారు.
మెుబైల్ స్క్రీన్
ఈ కొత్త మెుబైల్ 6.7 అంగుళాల AMOLED కర్వ్‌డ్ ఎడ్జ్ డిస్‌ప్లేతో రానున్నట్లు సమాచారం. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు FHD+ (1080 x 2412 pixel) రిజల్యూషన్ అందించినట్లు తెలిసింది. ఈ ఫోన్ Dimensity 8200 chipsetతో వర్క్ చేయనుంది.
ర్యామ్ & స్టోరేజ్
ఈ నయా ఒప్పొ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో రానున్నట్లు సమాచారం. 8GB RAM / 256GB స్టోరేజ్, 12GB RAM/ 512GB స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజ్ కానుంది.
బ్యాటరీ
Oppo Reno 11 సిరీస్‌ను 4,800mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారు. దీనికి 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారట. ఫలితంగా నిమిషాల వ్యవధిలోనే మెుబైల్‌ను ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
కెమెరా క్వాలిటీ
కొత్త ఒప్పో మెుబైల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుందట. 50MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రావైడ్ యాంగిల్ + 32MP టెలిఫొటో కెమెరా ఇందులో ఉన్నాయి. ఇక ముందు వైపు సెల్ఫీ కోసం 32MP కెమెరాను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ధర ఎంతంటే?
Oppo Reno 11 సిరీస్ ధరలను ఒప్పో లాంచ్ రోజునే ప్రకటించనుంది. అయితే Reno 11 మెుబైల్ 8GB+256GB వేరియంట్ ధర రూ.32,450 ఉండొచ్చని సమాచారం. అలాగే Reno 11 Pro 12GB+256GB వేరియంట్ ధర రూ. 46,350గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం