రిలయన్స్ జియో మరో సరికొత్త ప్రొడక్ట్‌తో భారతీయ మార్కెట్లోకి రాబోతోంది. అతి తక్కువ ధరకే కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇది పూర్తిగా ‘క్లౌడ్ సర్వీస్’ (Cloud Service) ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ డివైజ్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. గతేడాది జియో బుక్ (Jio Book), జియో బుక్ 4జీ (Jio Book 4G) పేరుతో రెండు ల్యాప్‌టాప్‌లను జియో రిలీజ్ చేసింది. దీంతో త్వరలో రాబోయే జియో క్లౌడ్ పీసీపై అందరి దృష్టి పడింది. ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ కంపెనీలతో చర్చలు
ల్యాప్‌టాప్‌ను తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చేందుకు దేశంలోని ప్రముఖ కంపెనీలైన ఏసర్ (Acer), హెచ్‌పీ (HP), లెనోవో (Lenovo)లతో జియో (Jio) చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇవి సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ట్రయల్స్ షురూ
ప్రస్తుతం జియో క్లౌడ్ ల్యాప్‌టాప్‌నకు సంబంధించిన ట్రయల్స్‌ను హెచ్‌పీ క్రోమ్ బుక్ (HP Chrome book) (ఇది కూడా గూగుల్ క్రోమ్ ఓఎస్ ఆధారిత క్లౌడ్ సర్వీస్‌తో పనిచేస్తుంది)లో చేస్తున్నారు.
నెలవారీ సబ్స్క్రిప్షన్లు
జియో క్లౌడ్ ల్యాప్‌టాప్ కోసం నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను జియో సిద్ధం చేస్తోంది. యూజర్లు అదనంగా ల్యాప్‌టాప్ వద్దనుకుంటే జియో క్లౌడ్ పీసీ సాఫ్ట్‌వేర్‌ను తమ కంప్యూటర్, స్మార్ట్‌టీవీల్లో ఇన్స్టాల్ చేసుకుని కంప్యూటింగ్ సర్వీస్‌ను పొందవచ్చు.
ఏమిటీ క్లౌడ్ ప్రత్యేకత?
సాధారణంగా ఒక ల్యాప్‌టాప్ ధరను అందులోని స్టోరేజ్, ప్రాసెసర్, చిప్సెట్, బ్యాటరీతోపాటు ఇతర హార్డ్‌వేర్ భాగాల ఆధారంగా నిర్ణయిస్తారు. వీటి ధర పెరిగితే దాని ప్రభావం ల్యాప్‌టాప్ ధరపై పడుతుంది. దీన్ని తగ్గించేందుకు జియో క్లౌడ్ పీసీని తీసుకొస్తోంది. ఇందులో సిస్టమ్ ప్రాసెసింగ్ మొత్తం జియో క్లౌడ్‌లో జరుగుతుంది. దీనివల్ల తక్కువ ధరకే వినియోగదారులు ల్యాప్‌టాప్‌ను పొందవచ్చు.
ధర ఎంతంటే?
జియో క్లౌడ్ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.15,000కు అందించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్లౌడ్ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన ఫీచర్లు లాంచింగ్‌కు రోజున బహిర్గతం కానున్నాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం