లెనోవో బ్రాండ్ నుంచి కొత్త ట్యాబ్ లాంచ్ అయింది. ‘ట్యాబ్ ఎం11’ (Lenovo Tab M11) మోడల్‌ను కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) – 2024 ఈవెంట్ సందర్భంగా లెనోవో విడుదల చేసింది. లెనోవో ట్యాబ్ ఎం10 కు కొనసాగింపుగా కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. గత ట్యాబ్‌తో పోలిస్తే దీనిలో బ్యాటరీ, ఆపరేటింగ్ సిస్టమ్‌లలో మేజర్ అప్ గ్రేడ్లు చేసినట్లు లెనోవో వెల్లడించింది. త్వరలోనే అమెరికా మార్కెట్లతో పాటు భారత్‌లోనూ ఈ ట్యాబ్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మరి ఈ ట్యాబ్ ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
బిగ్ స్క్రీన్
ఈ లెనోవో ట్యాబ్ 11 అంగుళాల FHD IPS LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. దీనికి 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. దీనిలో మల్టీ టాస్కింగ్ ఫీచర్ కూడా ఉంది. మూవీస్ చూసేటప్పుడు నోట్స్ రాసుకోవడంతో పాటు డూడుల్ చేయవచ్చు. MediaTek Helio G88 SoC ప్రాసెసర్, Mali-G52 MP2 జీపీయూ, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఫోన్ వర్క్ చేయనుంది.
ర్యామ్ & స్టోరేజ్
Lenovo Tab M11 మోడల్.. 6GB of LPDDR4x RAM / 128GB of eMMC 5.1 స్టోరేజ్ ఆప్షన్స్‌తో లాంచ్ అయ్యింది. స్టోరేజ్‌ను 1TB వరకూ పెంచుకునే అవకాశాన్ని లెనోవో కల్పించింది. ఈ ట్యాబ్‌లోని నీబో సాఫ్ట్ వేర్ (Nebo software) ద్వారా హ్యాండ్ రైటింగ్‌ని టెక్ట్స్‌గా కన్వర్ట్ చేయవచ్చు.
పవర్ఫుల్ బ్యాటరీ
Lenovo Tab M11ను 7,040mAh శక్తివంతమైన బ్యాటరీతో తీసుకొచ్చారు. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా అందించారు. దీని సాయంతో ట్యాబ్‌ను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చని లెనోవో వర్గాలు ప్రకటించాయి.
కెమెరా
ఈ ట్యాబ్ కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు 13MP ప్రైమరి కెమెరాను ఫిక్స్ చేశారు. ముందు వైపు వీడియో కాల్స్ కోసం 8MP సెల్ఫీ అమర్చారు. అలాగే లెనోవో ట్యాబ్ పెన్ మద్దతు కూడా దీనికి అందించారు.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ లెనోవో ట్యాబ్‌లో Dolby Atmos మద్దతు కలిగిన 3.5mm హెడ్‌ఫోన్ జాక్, Wi-Fi 802.11, Bluetooth v5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే 465 గ్రాముల బరువు, 55.26mm x 166.31mm x 7.15mm కొలతల్లో ట్యాబ్ రానుంది.
కలర్ ఆప్షన్స్
Lenovo Tab M11 రెండు కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ అయ్యింది. లూనా గ్రే ( Luna Grey), సీఫోమ్ గ్రీన్ (Seafoam Green) రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఎంతంటే?
లెనోవో ట్యాబ్ ఎం11 (4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ) ధరను 179 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది . మన కరెన్సీ ప్రకారం ఈ ట్యాబ్ విలువ రూ.14,900. ఏప్రిల్ నుంచి ఈ ట్యాబ్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం