అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ సేల్ (Amazon Great Republic Day Sale 2024) ప్రారంభమైంది. ఇందులో ప్రముఖ కంపెనీల స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మంచి స్మార్ట్‌వాచ్ తీసుకోవాలని భావిస్తున్న వారికి ఇదే సదావకాశం. మీకు నచ్చిన కంపెనీల వాచ్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. SBI క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 10% వరకూ రాయితీ కూడా పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో స్మార్ట్‌వాచ్‌లపై ఉన్న టాప్ డీల్స్ YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Noise Newly Smart Watch
ఈ నాయిస్ స్మార్ట్ వాచ్ రిపబ్లిక్ డే సేల్స్ సందర్భంగా 82% తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. రూ.5,999 విలువ గల ఈ వాచ్‌ను సేల్‌లో రూ.1,099లకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ 1.81 అంగుళాల డిస్ప్లే, Bluetooth Calling, AI Voice Assistance,160 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది.
Fire-Bolt Ring 3
ఈ రిపబ్లిక్ డే సేల్‌లో ఫైర్ బోల్ట్ స్మార్ట్‌వాచ్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Fire-Boltt Ring 3 వాచ్‌లో ఏకంగా 88% రాయితీ లభిస్తోంది. రూ.9,999 విలువైన ఈ వాచ్‌ను కేవలం రూ.1,199 దక్కించుకోవచ్చు. 1.8 అంగుళాల బిగ్ డిస్ప్లే, అడ్వాన్స్డ్ బ్లూటూత్ కాలింగ్ చిప్, వాయిస్ అసిస్టెన్స్, 118 Sports Modes తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Fire-Boltt Phoenix Pro
తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్‌వాచ్ కోరుకునే అమ్మాయిలకు ఇది చక్కటి ఆప్షన్. Fire-Boltt Phoenix Pro వాచ్.. ఈ సేల్‌లో 90% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. రూ.11,999 విలువైన ఈ వాచ్‌ను రూ.1,199 లకు పొందవచ్చు. ఈ వాచ్ 1.39 అంగుళాల స్క్రీన్, బ్లూటూత్ కాలింగ్, 120+ స్పోర్ట్ మోడ్స్, ఆరోగ్య మానిటర్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
Cultsport Ace XR
ఈ స్మార్ట్‌వాచ్‌ను 75% రాయితీతో పొందవచ్చు. దీని అసలు ధర రూ.9,999. కానీ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా రూ.2,499 ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 1.43 అంగుళాల Super Retina Amoled Display, 850 NITS Peak Brightness, బ్లూటూత్ కాలింగ్, హెల్త్ట్రాకింగ్ ఫీచర్లు వాచ్‌లో ఉన్నాయి.
TIMEX iConnect EVO+
భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చిన మరో స్మార్ట్‌వాచ్ ‘TIMEX iConnect EVO+’. దీనిని 67శాతం రాయితీతో రూ.1,799 దక్కించుకోవచ్చు. దీని అసలు ధర రూ.5,495. ఈ స్మార్ట్‌వాచ్ 2.04 అంగుళాల బిగ్ డిస్ప్లేతో పాటు బ్లూటూత్ కాలింగ్, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఫీచర్లుగా కలిగి ఉంది.
boAt Wave Style
తక్కువ బడ్జెట్లో బోట్ కంపెనీకి చెందిన స్మార్ట్‌వాచ్ కొనాలని భావించే వారికి ఇదే మంచి ఛాన్స్. boAt Wave Style వాచ్‌ను 82% డిస్కౌంట్‌తో అమెజాన్ అందిస్తోంది. రూ.1,149లకే దీన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ వాచ్ 1.69 అంగుళాల HD స్క్రీన్, లైవ్ క్రికెట్ స్కోర్స్, హెల్త్ ట్రాకింగ్ సెన్సార్లు ఉన్నాయి.
pTron Reflect Pro
ఈ పిట్రాన్ వాచ్ కూడా 74% రాయితీలో లభిస్తోంది. రూ.3,799 విలువ కలిగిన ఈ వాచ్‌ను కేవలం రూ.999 దక్కించుకోవచ్చు. ఈ వాచ్ 1.85 అంగుళాల స్క్రీన్‌తో పాటు బ్లూటూత్ కాలింగ్, 600 NITS బ్రైట్నెస్, 100+ వాచ్ ఫేసెస్, 5 రోజుల బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లను కలిగి ఉంది.
GIZMORE Cloud
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో GIZMORE కంపెనీకి చెందిన వాచ్‌లపై కూడా రాయితీ లభిస్తోంది. తక్కువ బడ్జెట్లో ఆ కంపెనీ వాచ్ కొనాలనుకునేవారికి GIZMORE Cloud బెస్ట్ ఛాయిస్. దీని అసలు ధర రూ.4,499. సేల్‌లో భాగంగా ఈ ఇది రూ.999 అందుబాటులోకి వచ్చింది. 1.85 అంగుళాల IPS లార్జ్ స్క్రీన్, AI వాయిస్ అసిస్టెంట్, ప్రైవసీ లాక్, మల్పీపుల్ స్పోర్ట్స్ మోడ్స్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Samsung Galaxy Watch4
శాంసంగ్ వాచ్‌ను కోరుకునేవారికి ఈ సేల్ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. రూ.26,999 విలువైన Samsung Galaxy Watch 4 స్మార్ట్‌వాచ్‌ను రూ.7,999 పొందవచ్చు.
beatXP Marv Neo
రూ.1000 లోపున్న బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లలో beatXP Marv Neo ఒకటి. రూ.6,499 విలువైన ఈ వాచ్‌ను అమెజాన్‌లో 86% డిస్కౌంట్‌తో రూ.899 ఆఫర్ చేస్తోంది. ఈ వాచ్ 1.85 అంగుళాల డిస్ప్లేతో పాటు బ్లూటూత్ కాలింగ్, AI Voice Assistant, 100+ Sports Modes, హెల్త్ ట్రాకింగ్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్.. కారణం ఇదే!