ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) మరో సరికొత్త సేల్‌ను ప్రారంభించింది. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ (Great Republic Day Sale)ను తీసుకొచ్చింది. ఇవాళ (జనవరి 13) మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కాగా, ఇది ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్కరూ సేల్‌లో ఇష్టమైన ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయవచ్చు. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు, EMI కొనుగోళ్లపై 10శాతం వరకూ రాయితీని పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ కంపెనీల మొబైల్స్‌పై అమెజాన్ ఆఫర్లు ప్రకటించింది. ఇంతకీ ఆ ఫోన్లు ఏవి? వాటిపై రాయితీ ఎంత? వంటి వివరాలను ఈ కథనంలో చూద్దాం.
Apple iPhone 13
ఐఫోన్ 13 (iPhone 13 ) మెుబైల్‌ను గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా తక్కువ ధరకే పొందవచ్చు. దీని అసలు ధర రూ.69,900 కాగా సేల్‌లో రూ.48,999కే కొనుగోలు చేయొచ్చని అమెజాన్ తెలిపింది. ఈ మెుబైల్ 6.1 అంగుళాల స్క్రీన్, 12MP ప్రైమరీ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, iOS 14 ఆపరేటింగ్ సిస్టమ్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Honor 90 5G
ఈ హానర్ మెుబైల్‌పై కూడా 40% రాయితీని అమెజాన్ ఆఫర్ చేస్తోంది. రూ.47,999 విలువ కలిగిన ఈ ఫోన్‌ను రూ.28,999 అందిస్తోంది. 6.7 అంగుళాల AMOLED డిస్ప్లే, 200MP మెయిన్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా, 8 GB RAM, 5000mAh బ్యాటరీ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Motorola Razr 40 Ultra
రూ.1,19,999 వద్ద విడుదలైన మోటొరోలా రేజర్ 40 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఈ సేల్‌లో కేవలం రూ.69,999కే లభించనుంది. దీనిపై ఏకంగా 42% డిస్కౌంట్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ మోటో ఫోన్.. 6.9 అంగుళాల స్క్రీన్, 165Hz రిఫ్రెష్ రేట్, 32MP సెల్ఫీ కెమెరా, 8GB RAM / 256GB స్టోరేజ్, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగిన 3800mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
iQoo Neo 7 5G
ఐకూ నియో 7 5జీ (iQoo Neo 7 5G) ఫోన్ ఎమ్మార్పీ ధర రూ.29,999 ఉండగా.. సేల్ సమయంలో రూ.23,999కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ 6.78 AMOLED డిస్ప్లే, 64MP మెయిన్ కెమెరా, 8GB RAM, 5000 mAh బ్యాటరీ తదితర ఫీచర్లను కలిగి ఉంది.
Samsung Galaxy A34 5G
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) స్మార్ట్‌ఫోన్ ధర రూ.32,999 కాగా, ఆఫర్లో భాగంగా రూ.25,499కే లభిస్తుంది. దీనిపై 23% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ గెలాక్సీ ఫోన్.. 6.6 FHD+ Super AMOLED స్క్రీన్, 48MP(OIS)+8MP+5MP ట్రిపుల్ కెమెరా సెటప్, 13MP సెల్ఫీ కెమెరా, Android 13.0 OS తదితర ఫీచర్లను కలిగి ఉంది.
Tecno Camon 20 Premier 5G
రూ.41,999 విలువైన టెక్నో క్యామాన్ ప్రీమియర్ 5జీ (Tecno Camon 20 Premier 5G) రూ.24,999కే పొందొచ్చు. ఇది 40% రాయితీతో వస్తుంది.ఈ ఫోన్ 6.67 అంగుళాల స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 50MP ప్రైమరీ కెమెరా, 8GB RAM, 512GB Storage తదితర ఫీచర్లతో వచ్చింది.
OnePlus Nord 3 5G
వన్‌ప్లస్ నార్డ్3 5జీ (OnePlus Nord 3 5G) ఫోన్‌ను రూ.4వేల తగ్గింపుతో రూ.29,999కే అమెజాన్ అందిస్తోంది. ఈ ఫోన్ 6.74 అంగుళాల స్క్రీన్, 120 Hz రిఫ్రెష్ రేట్, Android 13.1 ఆధారిత OxygenOS, 5000 mAh బ్యాటరీ తదితర ఫీచర్లను కలిగి ఉంది.
Realme Narzo 60 Pro
రియల్మీ నార్జో 60 ప్రో (Realme Narzo 60 Pro) రూ.23,999కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్‌పై 11 శాతం రాయితీని అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల OLED డిస్ప్లే, 8GB RAM / 128GB స్టోరేజ్, 120 Hz రిఫ్రెష్ రేటు, 100 MP OIS ప్రైమరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ తదితర ముఖ్యమైన ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
Vivo Y200 5G
వివో వై200 5జీ (Vivo Y200 5G) ఎమ్మార్పీ ధర రూ.27,999గా ఉంది. ఈ ఆఫర్ సమయంలో రూ.21,999కే మెుబైల్‌ను దక్కించుకోవచ్చు. ఈ ఫోన్‌పై 21% రాయితీ అందుబాటులో ఉంది. ఈ వివో ఫోన్ 6.67 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేటును ఫోన్‌కు అందించారు. 8GB RAM/128GB స్టోరేజ్, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగిన 4800mAh బ్యాటరీ ఫోన్‌కు అందించారు.
Redmi Note 13 5G
ఈ రెడ్మీ మెుబైల్ అసలు ధర రూ.22,999. సేల్‌లో భాగంగా ఇది రూ.19,999లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.67 FHD+ pOLED స్క్రీన్, Mediatek Dimensity 6080 ప్రొసెసర్, 108MP ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా తదితర ఫీచర్లను కలిగి ఉంది.
HONOR 90 5G
అమెజాన్ సేల్‌లో హనర్ 90 జీ (HONOR 90 5G) స్మార్ట్‌ఫోన్ కూడా భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి రానుంది. ఈ మెుబైల్ ధర రూ.47,999 కాగా, అన్ని రాయితీలు పోనూ ఈ మెుబైల్ రూ.28,999కే (షరతులు వర్తిస్తాయి) లభించనుంది.
iQOO Z7 Pro 5G
అమెజాన్‌లో సేల్‌లో ఈ స్మార్ట్ ఫోన్ కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. iQOO Z7 Pro 5G మెుబైల్ ధర రూ. 27,999. కానీ, అమెజాన్ 14% డిస్కౌంట్‌తో రూ.23,999లకు ఆఫర్ చేస్తోంది. ఈ iQOO మెుబైల్.. 120 Hz AMOLED FHD+ స్క్రీన్ కలిగి ఉంది. 64MP ప్రైమరీ కెమెరా, 4600mAh బ్యాటరీతో రూపొందించారు.
Lava Agni 2 5G
దేశీయ కంపెనీకి చెందిన ‘Lava Agni 2 5G’ స్మార్ట్‌ఫోన్ కూడా అమెజాన్ సేల్‌లో తక్కువ ధరకే లభిస్తోంది. రూ.25,999 ధర ఉన్న ఈ ఫోన్‌ను అమెజాన్ రూ.19,999కే అందిస్తోంది.
Redmi 12 5G, Redmi 12C
అమెజాన్ సేల్‌లో రెడ్మీ మెుబైల్స్ కూడా మంచి రాయితీతో లభిస్తున్నాయి. Redmi 12 5G రూ.12,999, Redmi 12C రూ.7,999 ధరకే లభించనున్నాయి. ప్రస్తుతం ఈ మెుబైల్స్ అసలు ధరలు వరుసగా రూ.17,999, రూ.14,999గా ఉన్నాయి.
Celebrities Featured Articles Politics
Allu Arjun: ‘నరబలి జరిగితే.. నా సినిమా హిట్టని అల్లు అర్జున్ అన్నాడు’.. కాంగ్రెస్ MLA షాకింగ్ కామెంట్స్