ప్రతిష్ఠాత్మక క్రీడా సంబరానికి హైదరాబాద్ వేదికగా మారనుంది. దేశవ్యాప్తంగా 7 నగరాల నుంచి పాల్గొనే జట్లతో ప్రైమ్ వాలీబాల్ లీగ్ నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖ క్రీడాకారులు పాల్గొనే ఈ లీగ్‌ను ఫిబ్రవరి 5 నుంచి 27 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
పాల్గొనే జట్లు ఇవే..
- హైదరాబాద్ బ్లాక్ హక్స్
- కాలికట్ హీరోస్
- కొచ్చి బ్లూ స్పైకర్స్
- అహ్మదాబాద్ డిఫెండర్స్
- చెన్నై బ్లిట్జ్
- బెంగళూరు ట్రొపేడోస్
- కోల్కత్తా థండర్ బోల్ట్స్
మ్యాచులు ఎక్కడ వీక్షించాలి?
మొత్తం 23 రోజుల పాటు జరిగే 24 మ్యాచులను సోనీ టెన్ 1(ఇంగ్లీష్), సోనీ టెన్ 2(హిందీ), సోనీ టెన్ 4(తమిళ్& తెలుగు), సోనీ టెన్ 2(మలయాళం) ఛానళ్లలో వీక్షించవచ్చు. హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్‌ను కొచ్చితో తలపడనుంది.
ప్రపంచ ఆటగాడి అభిప్రాయం ఇది
అమెరికాకు చెందిన స్టార్ వాలీబాల్ ప్లేయర్ డేవిడ్ లీ ఈ టోర్నీలో కాలికట్ హీరోస్ జట్టు తరఫున పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని.. అనేక మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల నుంచి ఎదిగారని పేర్కొన్నాడు. అలాగే వాలీబాల్ చాలా స్కిల్ ఉన్న గేమ్ అని.. ఈ ఆట చాలా ఎగ్జైట్మెంట్ని ఇస్తుందని పేర్కొన్నాడు.
పీవీ సింధుతో భేటీ
టోర్నీకి ముందు ఇతడు స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుతో భేటీ అయ్యాడు. మేం ఈ భేటీలో ఒలింపిక్స్ గురించి చర్చించామని.. పీవీ సింధు చాలా టాలెంటెడ్ అని లీ పేర్కొన్నాడు. అలాగే ఇదివరకే మేమిద్దరం స్నేహపూర్వక వాతావరణంలో మూడుసార్లు సమావేశమయ్యామని వివరించాడు.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?