• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Family Star First Review: మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా అదరగొట్టిన విజయ్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’ హిట్టా? ఫట్టా?

    నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, వాసుకి, రోహిణి హట్టంగడి, అభినయ, అజయ్‌ ఘోష్‌, కోట జయరాం, జబర్దస్త్ రాంప్రసాద్‌ తదితరులు

    రచన & దర్శకత్వం : పరుశురామ్‌ పెట్ల

    సంగీతం : గోపి సుందర్‌

    ఛాయా గ్రహణం : కె.యు మోహనన్‌

    ఎడిటింగ్‌ : మార్తండ్‌ కె. వెంకటేష్‌

    నిర్మాతలు : దిల్‌ రాజు, శిరీష్‌

    నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

    విడుదల తేదీ : ఏప్రిల్‌ 5, 2024

    విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్‌ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌‘ (Family Star Review In Telugu). నేడు (ఏప్రిల్‌ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. గీతా గోవిందం హిట్‌ తర్వాత విజయ్‌తో డైరెక్టర్‌ పరశురామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ఆడియన్స్‌లో మంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? విజయ్‌కు మరో హిట్‌ను అందించిందా? వంటి అంశాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    గోవ‌ర్ధన్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబానికి దూరంగా వెళ్లడం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ అండగా ఉంటాడు. ఈ క్రమంలో అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్దరూ ప్రేమ‌లో ప‌డతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధన్ చేతికందుతుంది. ఆ పుస్తకం వల్ల ఇద్దరు విడిపోతారు. ఇంత‌కీ ఆ పుస్తకంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధన్ తన కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ. 

    ఎవరెలా చేశారంటే

    నటుడు విజయ్‌ దేవరకొండ (Family Star Review In Telugu) ఎప్పటిలాగానే తన మార్క్ యాటిట్యూడ్‌తో ఈ మూవీలోనూ అదరగొట్టాడు. మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి పాత్రలో జీవించాడు. యాక్షన్, కామెడీ, ఎమోషనల్‌ సన్నివేశాల్లో తన మార్క్‌ చూపించి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాడు. ముఖ్యంగా డ్యాన్స్ పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాడు.  యాక్షన్ సన్నివేశాలు పరిమితంగానే ఉన్నా… తనదైన స్టైల్‌లో మెప్పించాడు. విజయ్- మృణాల్ మధ్య వచ్చే సీన్లు.. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కనిపించింది. తన నటనతో పాటు అందం, అభినయంతో ఈ బ్యూటీ ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్‌ – మృణాల్‌ మధ్య కెమెస్ట్రీ  వీరి మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది. ఇక వాసుకి, రోహిణి అభినయ, అజయ్‌ ఘోష్‌, కోట జయరాం, జబర్దస్త్ రాంప్రసాద్‌ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే?

    డైరెక్టర్ పరుశురామ్‌.. ఫ్యామిలీ స్టార్‌ ద్వారా మరోమారు తన దర్శకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. టైటిల్‌కు తగ్గట్లు పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించారు. ఫస్టాఫ్‌ ఫ్యామిలి సెంటిమెంట్, కమర్షియల్ అంశాలతో నింపేసిన దర్శకుడు.. సెకండాఫ్‌ మాత్రం లవ్ ట్రాక్, కామెడీ, ఎమోషనల్ అంశాలు మేళవించి ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ముఖ్యంగా విజయ్- మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే ఇగో తాలుకు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. కుటుంబం కోసం మిడిల్‌ క్లాస్‌ వారు ఏ విధంగా ఆలోచిస్తారన్న విషయాన్ని చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు పరుశురామ్. అయితే ఇదే ఫ్లోను సెకండాఫ్‌లో ఇంకాస్త కొనసాగిస్తే బాగుండేది. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ సీన్‌లో విజయ్- మృణాల్ మధ్య వచ్చే భావోద్వేగపూరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.   రొటిన్‌ కథను ఎంచుకోవడం, డైలాగ్స్‌లో పెద్దగా మెరుపులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.   ఓవరాల్‌గా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. 

    టెక్నికల్‌గా

    టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Family Star Review In Telugu).. విజయ్‌-పరుశురామ్‌ కాంబోలో గతంలో వచ్చిన ‘గీతా గోవిందం’ మూవీకి మ్యూజిక్‌ బాగా ప్లస్‌ అయ్యింది. అయితే  ఈ సినిమాలోనూ ఉన్న అన్ని పాటలు కూడా బాగున్నాయి. ఇంట్రోసాంగ్, కళ్యాణి వచ్చా వచ్చా, నందా నందన సాంగ్స్ ఫీల్‌ గుడ్‌గా ఉంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఇక సినిమాటోగ్రాఫర్‌ అద్భుత పనితీరు కనబరిచాడు. సినిమా మెుత్తాన్ని కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దిల్‌రాజు ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు. 

    ప్లస్‌ పాయింట్స్

    • విజయ్‌ – మృణాల్‌ కెమెస్ట్రీ
    • ఎమోషనల్‌ సీన్స్‌
    • కామెడీ

    మైనస్‌ పాయింట్స్‌

    • రొటిన్‌ కథ
    • సాగదీత సన్నివేశాలు

    Telugu.yousay.tv Rating : 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv