• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sobhita Dhulipala: పెళ్లి పీటలపై క్యూట్‌గా తలపడ్డ చైతూ-శోభిత.. వీడియో వైరల్‌!

    అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), శోభిత దూళిపాళ్ల (Sobhita Dhulipala) వివాహం డిసెంబర్‌ 4న అతికొద్ది మంది సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లికి అతి ముఖ్యులు మాత్రమే హాజరయ్యారు. మీడియా ప్రతినిధులను సైతం అనుమతించలేదు. దీంతో పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకొస్తూ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తొలుత చైతు-శోభిత పెళ్లి ఫొటోలు బయటకి రాగా ఆ తర్వాత తాళికట్టే వీడియో లీకయ్యింది. ఈ క్రమంలో రెండ్రోజుల తర్వాత వీరి పెళ్లికి సంబంధించి మరో ఆసక్తికర వీడియో బయటకొచ్చింది. అలాగే ఈ పెళ్లిలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన రామ్‌చరణ్‌ లుక్‌ కూడా తెగ ట్రెండింగ్‌ అవుతోంది. వాటిపై ఓ లుక్కేద్దాం. 

    చైతూ-శోభిత క్యూట్‌ ఫైట్‌!

    అక్కినేని వారసుడు నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు, ఎస్.ఎస్ రాజమౌళి, అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. అటు అభిమానులు, నెటిజన్లు సైతం విషేస్ చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా పెళ్లికి సంబంధించి మరో వీడియో బయటకొచ్చింది. అందులో చైతు-శోభితా జోడీ క్యూట్‌గా తలపడింది. ప్రతీ పెళ్లిలో జరిగినట్లుగానే ఈ జంట కూడా బిందెలో ఉంగరం తీసేందుకు పోటీ పడింది. చివరికీ ఉంగరం చైతూ చేతికి చిక్కడంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు. ఈ క్యూట్‌ వీడియోను చూసి అక్కినేని ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు. శోభితపై తమ హీరో పైచేయి సాధించాడంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. 

    శ్రీశైలంలో నవ వధువులు

    కొత్త జంట నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల (Sobhita Dhulipala)కు సంబంధించి మరో వీడియో నెట్టింట ట్రెండ్‌ అవుతోండి. పెళ్లి తర్వాత వారిద్దరూ తొలిసారి శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చైతూ, శోభితతో పాటు అక్కినేని నాగ చైతన్య కూడా శ్రీశైలం ఆలయానికి వెళ్లారు. చైతు, శోభిత పట్టు వస్త్రాల్లో దేవుడ్ని దర్శించుకున్నారు. 

    ఛత్రపతి శివాజీలా రామ్‌చరణ్‌

    మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) ప్రస్తుతం డైరెక్టర్‌ బుచ్చిబాబుతో ‘RC 16’ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. మల్లయోధుడి పాత్రలో చరణ్‌ కనిపించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చరణ్‌ ఆ పాత్రకు తగ్గట్లు మేకోవర్‌ అయ్యాడు. లాంగ్‌ హెయిర్‌తో పాటు కండలు తిరిగిన దేహంతో దర్శనమిస్తున్నాడు. ఈ క్రమంలోనే చైతూ – శోభిత పెళ్లికి చరణ్‌ హాజరయ్యాడు. బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌ బియర్డ్‌లో ఉన్న చరణ్‌ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చరణ్‌ లుక్‌ను ఛత్రపతి శివాజీతో నెటిజన్లు పోలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరు చూసేయండి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv