• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం

    సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను మంగళవారం కిమ్స్ ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు.

    Courtesy Instagram: dilraju

    మీడియాతో మాట్లాడిన దిల్‌ రాజు, ‘‘ఇలాంటి సంఘటనలు జరగడం ఎంతో బాధాకరం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించినప్పటి నుంచి నా బాధ్యతను సీరియస్‌గా తీసుకుంటున్నా. అయితే నేను అమెరికాలో ఉన్న కారణంగా ఇక్కడికి రాలేకపోయాను. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిని కలిశా. ప్రస్తుతం జరిగిన ఘటనపై పూర్తిగా దృష్టి సారించాను. అల్లు అర్జున్‌ను కూడా త్వరలోనే కలుస్తా. పరిశ్రమలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం చేస్తాం. రేవతి భర్త భాస్కర్‌కు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం,’’ అన్నారు.

    శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగవుతోంది

    ‘‘శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగవుతోంది. వైద్యులు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు. తాను త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నా,’’ అని ఆయన పేర్కొన్నారు.

    అదంతా దుష్ప్రచారమే

    ‘‘సంధ్య థియేటర్ ఘటన ఎవరూ కావాలని చేసిందేం కాదు. ఇది ఒక అపశ్రుతి. కానీ ఈ సంఘటనపై కొందరు దుష్ప్రచారం చేస్తుండడం బాధాకరం. ప్రభుత్వం చిత్ర పరిశ్రమను దూరం పెడుతోందనేది అసత్య ప్రచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలా సినీ పరిశ్రమకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. త్వరలోనే చిత్ర పరిశ్రమ ప్రతినిధులతో కలిసి సీఎం గారిని కలవాలని యోచిస్తున్నాం. ఎలాంటి సమస్యలు కలుగకుండా పరిశ్రమ కోసం పూర్తిస్థాయి ప్రయత్నం చేస్తాను,’’ అని దిల్‌ రాజు వెల్లడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv